హైదరాబాద్, వెలుగు: యాపిల్ ప్రీమియం రీసెల్లర్ ఆప్‌ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలను మొదలుపెట్టింది. తమ స్టోర్లన్నింటిలోనూ ఈ ఫోన్లను కొనుక్కోవచ్చని ప్రకటించింది. ఆప్‌ట్రానిక్స్‌కు దేశంలోని 14 నగరాలలో 47 ఔట్‌లెట్లు, 12 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. యాపిల్ 13 ఫోన్లలో ఏ15 బయోనిక్ చిప్‌తో పాటుగా మెరుగైన కెమెరాలు, ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ, వాటర్ రెసిస్టెంట్, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్, ప్రో మోషన్ -120 హెజ్ అడాప్టివ్ రిఫ్రెష్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐఫోన్ 13 మినీ రేట్లు రూ.70 వేల నుంచి, ఐఫోన్ 13 ధరలు రూ.80 వేల నుంచి, ఐఫోన్ 13 ప్రో ధరలు రూ.1.20 లక్షల నుంచి, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధరలు రూ.1.30 లక్షల నుంచి మొదలవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు హోల్డర్లకు రూ.ఆరు వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. యాపిల్ ఈ నెల ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ నైంత్ జనరేషన్ ఐపాడ్‌తోపాటు ఐపాడ్ మినీ, వాచ్ సిరీస్ 7 కూడా విడుదల చేసింది. ఆప్‌ట్రానిక్స్ సీఈఓ మేఘనా సింగ్ మాట్లాడుతూ తమ స్టోర్లకు రాలేని వాళ్లు ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్ ఇవ్వొచ్చని అన్నారు.
