ఐఫోన్ 14పై రూ.13వేల డిస్కౌంట్.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

ఐఫోన్ 14పై రూ.13వేల డిస్కౌంట్..  ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

ఐఫోన్ కొనడం చాలా మందికి ఓ కల. జీవితంలో అసలు దాన్ని కొంటామా అని అనుకునే వాళ్లూ లేకపోలేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లలో అత్యంత ఎక్కువ ఖరీదైన ఫోన్లలో ఆపిల్ ఫోన్లు ఒకటి. గతేడాది ఐఫోన్ 14 సిరీస్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసిన ఆపిల్.. దాని ధరను అధికారికంగా రూ.79,900 నుంచి ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ధరపై రూ.13వేల డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది.

ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 14 అధికారికంగా ధర రూ.79వేల 900నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 తగ్గింపు ధర రూ.70,999 గా ఉంది. ఇప్పుడు, అది మరింత తగ్గింది. దాదాపు రూ. 9000 ఫ్లాట్ తగ్గింపు అదనంగా చేరి అందుబాటులోకి వచ్చింది. అదెలా అంటే హెచ్ డీఎఫ్ సీ (HDFC) బ్యాంక్ కార్డ్ తో రూ.4వేల ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. దాంతో iPhone 14 ధర దాదాపు రూ.66వేలకి తగ్గుతుంది. అదనంగా మీ పాత ఐఫోన్ మోడల్ ను ఎక్స్ ఛేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకే ఐఫోన్ 14ను మీరు సొంతం చేసుకోవచ్చు.

మీ దగ్గర ఉన్న పాల్ ఐఫోన్ మోడల్ ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ కింద పెడితే మీరు కొనాలనుకున్న కొత్త ఐఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు రూ.30వేల వరకు తగ్గించనుంది. ఈ విధంగా ఐఫోన్ 14 తుది ధర మరింత తగ్గుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఎక్స్ఛేంజ్ విలువ మోడల్ ను బట్టి మారుతూ ఉంటుంది. దాంతో పాటు ఫోన్ కండిషన్ పైనా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఉదాహరణకు: మీ పాత ఫోన్‌లో (మీరు ఎక్స్ ఛేంజ్ చేయాలనుకుంటున్నది) డెంట్‌లు లేదా కొన్ని రకాల డ్యామేజ్‌లు ఉన్నట్లయితే లేదా ఏదైనా అంతర్గత సమస్యలు ఉన్నట్లయితే ఆ సమయంలో దాని విలువ తక్కువగా ఉంటుంది.

ఇప్పుడు అందర్లో తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే ప్రస్తుతం ఐఫోన్ 14 కొనుగోలు చేయడం సరైనదేనా? అని. దీనికి సమాధానంగా నిపుణులు అవును అనే చెబుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఐఫోన్ 13పాతది కావడమేనని అంటున్నారు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మాదిరిగానే ఉన్నప్పటికీ, రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను దృష్టిలో ఉంచుకుని రెండోదాన్ని కొనాలనుకోవడంలో ఎలాంటి నష్టమూ ఉండదు.  ప్రస్తుతం iPhone 13 , iPhone 14 ధరల మధ్య కూడా తేడా ఎక్కువేం లేదు. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.61,999కి అందుబాటులో ఉంది. కాబట్టి, రూ. 5000 అదనంగా పెట్టి ఐఫోన్ 14ని ఇప్పుడే పొందడం మంచిది.

తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ ఐఫోన్ 14  మంచి స్పెసిఫికేషన్లను అందిస్తోంది. ఇది పూర్తిగా A15 బయోనిక్ చిప్‌సెట్ బేస్డ్ ఆధారంగా నిర్మితమైంది. ఇది ప్రస్తుతం Apple నుంచి వస్తోన్న రెండో అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్. 128GB, 256GB , 512GB స్టోరేజీతో ఈ ఫోన్ మూడు రకాలలో లభిస్తోంది. - కెమెరాల విషయానికొస్తే, ఐఫోన్ 14 , ఐఫోన్ 13తో పోలిస్తే దీంట్లో డ్యూయల్ రియల్ కెమెరా సిస్టమ్‌ను ఉంటుంది. ఐఫోన్ 14 బ్యాటరీ పనితీరు కూడా చాలా బాగుంటుంది.  ఫోన్ ను ఒక్కసారి  ఛార్జ్‌ చేస్తే ఒక్క రోజు మొత్తం రావడం దీని స్పెషాలిటీ.  ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఐఫోన్ 14 కొనుగోలు చేయడంలో ఎలాంటి నష్టమూ లేదు.