టాటాల నుంచి ఐఫోన్‌‌‌‌‌‌‌‌ 15!

టాటాల నుంచి ఐఫోన్‌‌‌‌‌‌‌‌ 15!

న్యూఢిల్లీ: ఐఫోన్‌‌‌‌‌‌‌‌ 15, ఐఫోన్‌‌‌‌‌‌‌‌ 15 ప్లస్  మోడల్స్‌‌‌‌‌‌‌‌ను టాటా గ్రూప్  ఇండియాలో తయారు చేయనుందని తైవాన్​కు చెందిన మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ఇందుకు సంబంధించి యాపిల్‌‌‌‌‌‌‌‌తో ఈ కంపెనీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ను కుదుర్చుకుందని వెల్లడించింది. ఒకవేళ ఇదే నిజమైతే దేశంలో యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్న నాలుగో కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది.

కానీ, మొత్తం ఐఫోన్లలో టాటా గ్రూప్ ఎంత పర్సంటేజ్ మేర తయారు చేస్తుందనేది ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం యాపిల్‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో విస్ట్రాన్‌‌‌‌‌‌‌‌, ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌, పెగట్రాన్ ..మూడు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ఉన్నారు. టాటా గ్రూప్ నాల్గోది కానుంది. కాగా, విస్ట్రాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన కర్నాటక ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేయనుందని రిపోర్ట్స్ వస్తున్నాయి.