
ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు చైనా పెట్టింది. ఇక సెల్ ఫోన్ వచ్చిన తరువాత దాదాపు అన్ని ఐఫోన్లు చైనాలో తయారయ్యేవి.. ఇదంతా కరోనాకు ముందు... ఇప్పుడు అన్ని కంపెనీలు చైనాకు దూరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రఖ్యాత తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండియాలో తన యూనిట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.
300 ఎకరాల భూమి కొనుగోలు
బెంగళూరు శివారులో విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు వెల్లడించింది. ఈ సైట్ కొనుగోలు కోసం అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మూడు బిలియన్ రూపాయలను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఫాక్స్కాన్ కర్ణాటకలో కొత్త ఫ్యాక్టరీకి సంబంధించి 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు కొద్ది రోజుల క్రితం పెట్టుబడుల విషయమై ప్రధాని నరేంద్రమోడీతో చర్చించారు.చైనా తరువాత రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల మార్కెట్గా ఉన్న ఇండియా...దిగ్గజ కంపెనీలకు మంచి గమ్యస్థానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత్ తో ముంబై, ఢిల్లీల్లో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించారు.
బెంగళూరులో లక్ష ఉద్యోగాలు
ఆపిల్ ఉత్పత్తుల అసెంబ్లింగ్ ప్లాంట్ త్వరలో రానున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన వెల్లడించారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు "భాగస్వామ్యాలను మరింతగా పెంచుకోవడానికి.. సెమీకండక్టర్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త రంగాల్లో సహకారం కోసం" కర్ణాటకను సందర్శించారు. ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్ తన ప్లాంట్‌లో 2019 నుండి భారతదేశంలో ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను తయారు చేస్తోంది.