IPL-14: హైదరాబాద్‌‌పై 6 రన్స్‌‌ తేడాతో బెంగళూరు‌ విక్టరీ

IPL-14: హైదరాబాద్‌‌పై 6 రన్స్‌‌ తేడాతో బెంగళూరు‌ విక్టరీ

హైదరాబాద్‌‌ టార్గెట్‌‌ 20 ఓవర్లలో 150 రన్స్‌‌.  వార్నర్‌‌ (54), మనీశ్​ పాండే (38) చెలరేగడంతో ఓ దశలో టీమ్‌‌ స్కోరు 16 ఓవర్లలో 115/2.  మ్యాచ్​ గెలవాలంటే 24 బాల్స్‌‌లో 35 రన్స్‌‌ చేయాలి. క్రీజులో పాండేతో పాటు బెయిర్‌‌స్టో (12) ఉన్నాడు. ఇక సన్‌‌రైజర్స్‌‌ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో ఆర్‌‌సీబీ స్పిన్నర్‌‌ షాబాజ్‌‌ అహ్మద్‌‌ అద్భుతం చేశాడు. ఒక్క రన్‌‌ ఇచ్చి ఆరు బాల్స్‌‌ తేడాలో  బెయిర్‌‌స్టో, పాండే, సమద్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో విక్టరీ ఈక్వేషన్‌‌ 18 బాల్స్‌‌లో 34 రన్స్‌‌గా మారిన దశలో విజయ్‌‌ శంకర్‌‌ (3), హోల్డర్‌‌ (4) ఔట్‌‌కావడంతో లాస్ట్‌‌ ఓవర్‌‌లో 16 రన్స్‌‌ అవసరమయ్యాయి.  క్రీజులో ఉన్న రషీద్‌‌ (17)గానీ, భువనేశ్వర్‌‌ (2 నాటౌట్‌‌)గానీ ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ఓవరాల్‌‌గా లాస్ట్‌‌ నాలుగు ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి హైదరాబాద్‌‌ రెండో ఓటమిని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్‌‌ చేసింది. మ్యాక్స్‌‌వెల్‌‌ (41 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) చెలరేగాడు. కోహ్లీ (29 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 33) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్‌‌ (3/30) మూడు వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్‌‌20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌‌ మాత్రమే చేసి ఓడింది. 


బౌలర్లు.. అదుర్స్‌‌
బెంగళూరును స్టార్టింగ్‌‌లో హైదరాబాద్‌‌ బౌలర్లు కట్టడి చేశారు. సెకండ్‌‌ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టి టచ్‌‌లోకి వచ్చిన పడిక్కల్‌‌ (11)ను థర్డ్‌‌ ఓవర్‌‌లో భువీ (1/30) ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. అయితే ఓ ఎండ్‌‌లో కోహ్లీ స్థిరంగా ఆడినా అనుకున్న స్థాయిలో రన్స్‌‌ రాలేదు. దాదాపు 12 ఓవర్లు క్రీజులో ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన షాబాజ్‌‌ అహ్మద్​ (14).. నదీమ్‌‌ బౌలింగ్‌‌లో షార్ట్‌‌ ఫైన్‌‌ లెగ్‌‌లో సిక్సర్‌‌ బాదినా.. ఎక్కువసేపు వికెట్‌‌కాపాడుకోలేదు. ఆరో ఓవర్‌‌లో విరాట్‌‌ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌‌ప్లేలో బెంగళూరు 47/1 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌‌లో నదీమ్‌‌ (1/36)..  షాబాజ్‌‌ వికెట్‌‌ తీయడంతో మ్యాక్స్‌‌వెల్‌‌ క్రీజులోకి వచ్చాడు. రషీద్‌‌ (2/18) బాల్‌‌ను రోప్‌‌ దాటించిన మ్యాక్సీ చివర్లో జోరు చూపెట్టాడు. నాలుగు ఓవర్లలో 16 రన్సే రావడంతో తొలి 10 ఓవర్లలో ఆర్‌‌సీబీ 63/2 స్కోరే చేసింది. అయితే  అప్పటివరకు నెమ్మదిగా ఆడిన మ్యాక్సీ.. 11వ ఓవర్‌‌ (నదీమ్‌‌)లో 6, 4, 6తో రెచ్చిపోయాడు. కోహ్లీ కూడా ఓ ఫోర్‌‌ బాదడంతో ఈ ఓవర్‌‌లో 22 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో నటరాజన్‌‌ 6 రన్స్‌‌ ఇచ్చాడు. కానీ ఇక్కడి నుంచి మ్యాచ్‌‌ మరో మలుపు తీసుకుంది. హోల్డర్‌‌ వేసిన 13వ ఓవర్‌‌లో భారీ పుల్‌‌ షాట్‌‌కు ట్రై చేసిన కోహ్లీ.. విజయ్‌‌ శంకర్‌‌ చేతికి చిక్కాడు. దీంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 44 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌లో మిస్టర్‌‌ 360 డివిలియర్స్‌‌ (1)ను రషీద్‌‌ పెవిలియన్‌‌కు పంపాడు. 15వ ఓవర్‌‌లో 7 రన్స్‌‌ వచ్చినా.. 16వ ఓవర్‌‌లో రషీద్‌‌.. సుందర్‌‌ (8)ను ఔట్‌‌ చేయడంతో ఆర్‌‌సీబీ 16 ఓవర్లలో 105/5తో కష్టాల్లో పడింది. తర్వాతి ఓవర్‌‌లో క్రిస్టియన్‌‌ (1).. ఆఫ్‌‌ సైడ్‌‌ బాల్‌‌ను వెంటాడి ఔటయ్యాడు. 18వ ఓవర్‌‌లో జెమీసన్‌‌ (12) రెండు, మ్యాక్స్‌‌వెల్‌‌ ఓ ఫోర్‌‌ బాదడంతో 14 రన్స్‌‌ వచ్చాయి. నటరాజన్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు బాదిన మ్యాక్స్‌‌వెల్‌‌ 38 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. ఆఖరి ఓవర్‌‌లో 6 కొట్టి మ్యాక్సీ ఔటయ్యాడు. లాస్ట్‌‌ త్రీ ఓవర్స్‌‌లో 39 రావడంతో 110/6తో ఉన్న ఆర్‌‌సీబీ స్కోరు 149/8కి చేరింది. 
83 పార్ట్​నర్​షిప్​
టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ వార్నర్‌‌, మనీశ్​ పాండే మంచి సమన్వయంతో ఆడారు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వికెట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి సక్సెస్‌‌ అయ్యారు. థర్డ్‌‌  ఓవర్‌‌లో సాహా (1) ఔటైనా.. అవసరమైనప్పుడు భారీ షాట్లు కొడుతూ ఈ ఇద్దరు పోటీపడి ఆడారు. ఫోర్త్‌‌ ఓవర్‌‌లో ఇద్దరు కలిసి రెండు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో 17 రన్స్‌‌ రాబట్టారు. ఆరో ఓవర్‌‌లో వార్నర్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో హైదరాబాద్‌‌ స్కోరు 50/1కి చేరింది. ఫీల్డింగ్‌‌ సడలించిన తర్వాత ఈ ఇద్దరు కాస్త నెమ్మదించారు. సుందర్‌‌ బౌలింగ్‌‌లో పాండే సిక్స్‌‌ కొడితే, వార్నర్‌‌ రెండు ఫోర్లు మాత్రమే రాబట్టాడు. దీంతో నాలుగు ఓవర్లలో 27 రన్సే రావడంతో 10 ఓవర్లలో స్కోరు 77/1 అయ్యింది. 11వ ఓవర్‌‌లో వార్నర్‌‌ రివర్స్‌‌ స్వీప్‌‌తో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు బౌలర్లను మార్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 12వ ఓవర్‌‌లో హర్షల్‌‌ రెండు రన్సే ఇచ్చినా, వార్నర్‌‌ 31 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌కు జెమీసన్‌‌ 14వ ఓవర్‌‌లో ఝలక్‌‌ ఇచ్చాడు. నిలకడగా ఆడుతున్న వార్నర్‌‌ను.. స్లో పేస్‌‌ బాల్‌‌తో ఔట్‌‌ చేశాడు. దీంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 83 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన బెయిర్‌‌స్టో (12) ఫోర్‌‌తో ఖాతా తెరిచాడు.  ఈ ఇద్దరు సింగిల్స్‌‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో 15, 16 ఓవర్లలో వరుసగా 6, 7 రన్సే వచ్చాయి. కానీ ఇక్కడి నుంచే మ్యాచ్‌‌ ఊహించని మలుపు తీసుకుంది.   

బెంగళూరు: కోహ్లీ (సి) శంకర్‌‌ (బి) హోల్డర్‌‌ 33, పడిక్కల్‌‌ (సి) నదీమ్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 11, షాబాజ్‌‌ (సి) రషీద్‌‌ (బి) నదీమ్‌‌ 14, మ్యాక్స్‌‌వెల్‌‌ (సి) సాహా (బి) హోల్డర్‌‌ 59, డివిలియర్స్‌‌ (సి) వార్నర్‌‌ (బి) రషీద్‌‌ 1, సుందర్‌‌ (సి) పాండే (బి) రషీద్‌‌ 8, క్రిస్టియన్‌‌ (సి) సాహా (బి) నటరాజన్‌‌ 1, జెమీసన్‌‌ (సి) పాండే (బి) హోల్డర్‌‌ 12, హర్షల్‌‌ పటేల్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 149/8. వికెట్లపతనం: 1–19, 2–47, 3–91, 4–95, 5–105, 6–109, 7–136, 8–149. బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 4–0–30–1, హోల్డర్‌‌ 4–0–30–3, నదీమ్‌‌ 4–0–36–1, నటరాజన్‌‌ 4–0–32–1, రషీద్‌‌ 4–0–18–2. 
హైదరాబాద్‌‌: సాహా (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) సిరాజ్‌‌ 1, వార్నర్‌‌ (సి) క్రిస్టియన్‌‌ (బి) జెమీసన్‌‌ 54, పాండే , బెయిర్‌‌స్టో (సి) డివిలియర్స్‌‌ (బి) షాబాజ్‌‌ 12, అబ్దుల్‌‌ సమద్‌‌ (సి అండ్‌‌ బి) షాబాజ్‌‌ 0, విజయ్‌‌ శంకర్‌‌ (సి) కోహ్లీ (బి) పటేల్‌‌ 3,  హోల్డర్‌‌ (సి) క్రిస్టియన్‌‌ (బి) సిరాజ్‌‌ 4, రషీద్‌‌ (రనౌట్‌‌) 17, భువనేశ్వర్‌‌ (నాటౌట్‌‌) 2, షాబాజ్‌‌ నదీమ్‌‌ (సి) షాబాజ్‌‌ అహ్మద్‌‌ (బి) పటేల్‌‌ 0, నటరాజన్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 143/9. వికెట్లపతనం: 1–13, 2–96, 3–115, 4–115, 5–116, 6–123, 7–130, 8–142, 9–142. బౌలింగ్‌‌: సిరాజ్‌‌ 4–1–25–2, జెమీసన్‌‌ 3–0–30–1, సుందర్‌‌ 2–0–14–0, చహల్‌‌ 4–0–29–0, హర్షల్‌‌ పటేల్‌‌ 4–0–25–2, క్రిస్టియన్‌‌ 1–0–7–0, షాబాజ్‌‌ అహ్మద్‌‌ 2–0–7–3.