ఐపీఎల్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లో!

ఐపీఎల్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లో!

భాగ్యనగరంలో మరోసారి ఐపీఎల్​ ఫైనల్ ​నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పన్నెండో సీజన్​ తుదిపోరుకు హైదరాబాద్ ను స్టాండ్​బై వేదికగాఎంపిక చేస్తూ సోమవారం జరిగిన సీఓఏ సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్​ గ్రౌండ్​ అయిన చెన్నై చెపాక్​ స్టేడియంలో ఫైనల్​ జరగాలి. అయితే, చెపాక్‌ లోని మూడు స్టాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివాదం తేలకపోవడంతో సీఓఏ.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ కు (టీఎన్‌ సీఏ) ఓ వారం గడువు ఇచ్చింది. వివాదం పరిష్కరించుకోకపోతే ఫైనల్‌ ను తరలిస్తారు. 2012 నుంచి జరుగుతున్న ఈ స్టాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో గతేడాది రన్నరప్‌ కు ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం కల్పించారు. ఒక వేళ ఫైనల్‌ ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తే ప్లే ఆఫ్‌ , ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ లు బెంగళూరులో జరిగే అవకాశం ఉన్నట్టు సమచారం.

వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళల ఐపీఎల్‌ మహిళల మినీ ఐపీఎల్‌ కు కూడా సీఓఏ సమావేశంలో లైన్‌ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు తెలిసింది. మూడు జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే టోర్నీకి ఆమోదం లభించింది. ఫైనల్‌ తో కలిపి మొత్తం నాలుగు మ్యా చ్‌ లు జరుగుతాయి. మ్యాచ్‌ లన్నీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి. ఇందులో ఒకమ్యాచ్‌ వైజాగ్‌ లో నిర్వహించనుండగా మిగిలినమ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి.15న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్​ టీమ్​ ఎంపిక ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడే టీమిండియాను ఈ నెల 15వ తేదీన ఎంపికచేయాలని సీవోఏ బోర్డుకు సూచించింది. మే 30వతేదీన ప్రారంభమయ్యే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడే జట్లను ఏప్రిల్‌ 23వ తేదీ లోపు ప్రకటించాల్సిఉంది. దీంతో తుది గడువుకు ఎనిమిది రోజుల ముందే 15మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు. అలాగే, ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌ ఏర్ పాటుకు సంబంధించి సీఓఏ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లో అసోసియేషన్‌ ఏర్పాటు జరిగేలా నలుగురు సభ్యులకమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఇండియాలోజరిగే దేశవాళీ, ఇంటర్నేషనల్‌ టోర్నీలకు టైటిల్‌ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పేటీఏమ్‌ సంస్థతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియనుండడంతో కొత్తగా టెండర్లు పిలవాలని ఈసమావేశంలో నిర్ణయించారు.