
అబుదాబి వేదికగా శనివారం కోల్ కతా రైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది.కోల్ కతా తో చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (74), మయాంక్ అగర్వాల్ (56) తొలివికెట్ కు 14.2 ఓవర్లలో 115 పరుగులు జోడించి శుభారంభం అందించారు.
అయితే కోల్ కతా బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ ను దెబ్బకొట్టాడు. చివరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా..పంజాబ్ జట్టు 12 పరుగులు చేసి ఓటమి పాలైంది.
ఈ విక్టరీతో కోల్ కతా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.