తెగ చూస్తున్నారు.. అరబ్ గడ్డపై ఐపీఎల్ రికార్డ్ వ్యూయర్ షిప్

తెగ చూస్తున్నారు.. అరబ్ గడ్డపై ఐపీఎల్ రికార్డ్ వ్యూయర్ షిప్

‌‌ముంబై: అరబ్‌ గడ్డపై ఎమ్టీ స్టాండ్స్‌ లో జరుగుతున్న ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇండియా, ఇంటర్నేషనల్‌ స్టార్ల ఆటను టీవీల్లో చూస్తూ ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.దాంతో, లీగ్‌ వ్యూయర్‌ షిప్‌ అమాంతం పెరిగిపోయింది. ఫస్ట్‌‌ వీక్‌ కు గతేడాదితో పోల్చితే 15 శాతం అధిక వ్యూయర్‌ షిప్‌ లభించింది. ఏకంగా 60.6 బిలియన్‌ మినిట్స్‌ వ్యూస్‌‌ వచ్చాయని బ్రాడ్‌‌కాస్ట్‌‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌‌ కౌన్సిల్‌ టీవీ మెజర్‌ మెంట్‌‌ బాడీ ప్రకటించింది. ఈ సారి ప్రతి మ్యాచ్‌ కు సగటున 39 మిలియన్ల వ్యూస్‌‌ వస్తున్నాయని, ఇది లాస్ట్‌‌ ఇయర్‌ కంటే 21 శాతం పెరిగిందని చెప్పింది. జనాలు ఇళ్లకే పరిమితం కావడం, మ్యాచ్‌ లు అరగంట ముందే ప్రారంభం కావడం వ్యూయర్‌ షిప్‌ పెరుగుదలకు కారణమని తెలిపింది. ఓవరాల్‌ గా ఓపెనింగ్‌ వీక్‌ ను 269 మిలియన్ల మంది చూశారని చెప్పింది. ఇది గతేడాది కంటే 11 మిలియన్లు అధికమని తెలిపింది. ఇక, చెన్నై,ముంబై మధ్య ఫస్ట్‌‌ మ్యాచ్‌ ను 158 మిలియన్ల మంది చూశారని (2019 కంటే 21 శాతం అధికం), ఇది లాస్ట్‌‌ ఇయర్‌ చెన్నై–ఆర్‌ సీబీ మధ్య తొలి మ్యాచ్‌ కంటే 65 శాతం ఎక్కువ అని పేర్కొంది.