ఏడుసార్లు చనిపోవడానికి ట్రై చేశా.. నిజం చెప్పిన బాలయ్య హీరోయిన్!

ఏడుసార్లు చనిపోవడానికి ట్రై చేశా.. నిజం చెప్పిన బాలయ్య హీరోయిన్!

దక్షణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి మోహిని.   తన సుదీర్ఘ నట జీవితంలో అనేక భాషల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా సినీ రంగానికి దూరంగా ఉన్నా..  ఆమె పేరు మాత్రం  ప్రేక్షకుల మనసుల నుంచి చెరిగిపోదు.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ మెరిసిన మోహిని..  శివాజీ గణేశన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజ నటులతో కలిసి పని చేశారు. అక్షయ్ కుమార్ సరసన బాలీవుడ్ చిత్రం "డ్యాన్సర్"లో కథానాయికగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఆదిత్య 369తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఏడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా..

అయితే ఇటీవల ఒక ఇంటర్యూలో  ఆమె తన జీవితంలోని కొన్ని కఠినమైన సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  పెళ్ళైన తర్వాత నా భర్త, పిల్లలతో సంతోషంగానే ఉన్నాను. అయినా కూడా నాలో ఏదో ఒక తెలియని నిరాశఏర్పడింది. ఆ నిరాశ నుంచి ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాను. జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ, నేను మరణం గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. ఇది నాకు ఎంతమాత్రం అర్థం కాలేదు. ఈ దశలో ఆమె ఏడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని మోహిని వెల్లడించింది..   

డిప్రెషన్, మానసిక వేదన ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో ఒక జ్యోతిష్యుడు ఆమెకు ఒక సలహా ఇచ్చినట్లు మోహిని తెలిపారు. మిమ్మల్ని ఎవరో క్షుద్రశక్తితో ప్రభావితం చేశారు అని ఆయన చెప్పినప్పుడు, మొదట నవ్వి ఊరుకున్నానని  చెప్పారు. కానీ ఆ మాటల తరువాత ఆమెకు తనపై తానే ఒక ప్రశ్న వేసుకున్నారు. ఒకప్పుడు ధైర్యంగా ఉండే నేను, ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదే ఆమె జీవితంలో ఒక మలుపుగా మారిందని చెప్పుకొచ్చింది.

నాపై  బ్లాక్ మ్యాజిక్ చేసి.. 

నా భర్త బంధువుల్లో ఒక మహిళ నాపై  బ్లాక్ మ్యాజిక్ చేసిందని నాకు తర్వాత తెలిసింది అని మోహిని ఆరోపించారు. ఈ క్షుద్రశక్తి కారణంగానే తన జీవితంలో ఇన్ని సమస్యలు ఎదురయ్యాయని నమ్మాను అని తెలిపారు. ఈ చీకటి రోజులనుండి బయటపడటానికి ఆమెకు తన క్రైస్తవ విశ్వాసం ఎంతో సహాయపడిందని అన్నారు. 2006లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మోహిని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. నాకు ఆ సమయంలో యేసుక్రీస్తు మాత్రమే తోడుగా ఉన్నారని నేను బలంగా నమ్ముతాను. నా జీవితంలో ఆ చీకటి దశ నుండి బయటపడటానికి ఆయన ఇచ్చిన బలం చాలా గొప్పది. ఆయనే నన్ను రక్షించారు అని ఆమె చెప్పారు.

►ALSO READ | మహేష్ బాబు నుంచి.. ఈ ట్వీట్ అస్సలు ఊహించలా..! ఫోన్ స్విచాఫ్ చేసుకోవద్దని చెప్పాడు !

మోహిని పంచుకున్న ఈ నిజాలు ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. కానీ తన జీవితంలోని ఈ చీకటి కోణాలను ధైర్యంగా వెల్లడించడం ద్వారా ఆమె డిప్రెషన్‌తో పోరాడుతున్న ఎంతోమందికి స్ఫూర్తి అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఆమె పోరాట స్ఫూర్తి, తన విశ్వాసంపై ఆమెకున్న నమ్మకం ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తున్నాయంటున్నారు. మోహిని మళ్ళీ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు.