మహేష్ బాబు నుంచి.. ఈ ట్వీట్ అస్సలు ఊహించలా..! ఫోన్ స్విచాఫ్ చేసుకోవద్దని చెప్పాడు !

మహేష్ బాబు నుంచి.. ఈ ట్వీట్ అస్సలు ఊహించలా..! ఫోన్ స్విచాఫ్ చేసుకోవద్దని చెప్పాడు !

సక్సెస్కు, ఫెయిల్యూర్కు చిన్నాపెద్దా తేడాలుండవు. ఫెయిల్యూర్ ఎంత తోపునైనా కిందకు తోసేస్తుంది. ప్రయత్నంలో నిజాయితీ ఉంటే సక్సెస్ ఎంత చిన్నోడినైనా సింహాసనంపై కూర్చోబెడుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య ఇలాంటి అద్భుతాలే జరుగుతున్నాయి. మహేష్ బాబు చేసిన ట్వీటే ఇందుకు ఉదాహరణ. టాలీవుడ్లో మహేష్ బాబు స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత పెద్ద స్టార్ హీరో తెలుగు సినీ ప్రేక్షకులకు నిన్నమొన్నటి దాకా పెద్దగా పరిచయం లేని కుర్రాడి గురించి ట్వీట్ చేశాడు. ‘ఎక్స్’లో అతనిని ట్యాగ్ చేసి మరీ ‘నువ్వు దయ చేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్.. ఇక నుంచి నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. కుమ్మేసెయ్.. కంగ్రాట్స్’ అని మహేశ్ బాబు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.

అసలు.. మహేశ్ బాబు ఇలా ఎందుకు ట్వీట్ చేశాడు..? ఎవరిని ఫోన్ స్విచాఫ్ చేసుకోవద్దన్నాడు..? తెలియాలి.. తెలిసితీరాలి.. అంటారా..? ఇది తెలియాలంటే ముందు మీకు ‘దేవర’ కథ తెలియాల్సిన అవసరం లేదు గానీ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా గురించి తెలిస్తే చాలు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ’గా మారింది. సుమారు రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళుతోంది.

రాజమౌళి సినిమాతో బిజీబిజీగా ఉన్న మహేష్ బాబు కాస్తంత తీరిక సమయం చూసుకుని ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశాడు. సినిమా నచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశానని, బాగుందని రివ్యూ ఇచ్చాడు. అయితే.. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమిల్లి మహేష్ బాబుకు వీరాభిమాని. ఈ సినిమా కంటెంట్తో పాటు మ్యూజిక్కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో.. సింజిత్ ఒక ఇంటర్వ్యూలో.. బాబు (మహేష్ బాబు) తన గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఒక వన్ వీక్ వెళ్లిపోతానని సింజిత్ అన్నాడు.

►ALSO READ | HappyBirthdayModi: ప్రధాని మోడీ బర్త్ డే స్పెషల్.. వీడియోలు రిలీజ్ చేసి విష్ చేసిన టాలీవుడ్ స్టార్స్

సింజిత్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు మహేష్ ఇలా సింజిత్ను ‘ఎక్స్’లో ట్యాగ్ చేస్తూ.. ‘నువ్వు దయ చేసి ఫోన్ ఆపేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. సింజిత్ ముందుమందు మరింత బిజీ అవ్వాలని మహేష్ ఆకాంక్షించాడు. ‘ఎక్స్’లో మహేష్ చేసిన ఈ ట్వీట్ బీభత్సంగా వైరల్ అయింది. ఈ పోస్ట్ పెట్టి 24 గంటలు కూడా గడవక ముందే 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఏ రేంజ్లో ఈ ట్వీట్ వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్కు ఇంతకు మించిన ‘జెర్సీ’  మూమెంట్ ఏముంటుందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.