
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగే కీలక పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. బుధవారం ఆర్సీబీ చేతిలో కేకేఆర్ ఓడిపోయిన నేపథ్యంలో ఇవ్వాళ జరిగే మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది. టేబుల్‌లో టాప్-4లో నిలవాలంటే వార్నర్ కెప్టెన్సీలోని రైజర్స్‌కు, స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ టాప్-4లో నిలుస్తుంది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే తదుపరి ఆడబోయే 5 మ్యాచుల్లో కనీసం నాలుగింట్లో విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రాణం పెట్టి పోరాడతాయనే చెప్పాలి. వార్నర్-ఆర్చర్, రషీద్ ఖాన్-జోస్ బట్లర్‌కు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. మరి ఈ ఆసక్తికర మ్యాచ్‌లో గెలిచి ఏ జట్టు ముందుకెళ్తుందో చూడాల్సిందే.