
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌ను థ్రిల్లింగ్ విక్టరీలతో ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుస ఓటములతో డీలా పడింది. బ్యాటింగ్‌లో జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్‌పై ఎక్కువగా ఆధారపడటం ఆ టీమ్‌ను దెబ్బ తీస్తోంది. అనుభవమున్న రాబిన్ ఊతప్ప లాంటి ప్లేయర్ రాణించకపోవడం రాజస్థాన్ విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. రాబిన్ రాణించాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ చెప్పాడు. ‘రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్ రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. ఊతప్ప ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. అతడు రాణించాలి. ఊతప్పపై చాలా ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. అతడు మ్యాచ్‌లు ఫినిష్ చేయాలి. కుదరకపోతే కనీసం మిడిల్ ఆర్డర్‌లో అవసరమైన మూమెంటమ్ ఇవ్వాలి. తనపై పెట్టుకున్న ఆశలను రాబిన్ నిజం చేయాలి. రియాన్ పరాగ్ కూడా ఫామ్‌లో ఉన్నట్లు అనిపించట్లేదు. అతడు జట్టులో తన స్థానాన్ని పదిలపర్చుకోవాలి. బెన్ స్టోక్స్ జట్టులో చేరితే కాంబినేషన్ పూర్తిగా మారిపోతుంది’ అని గౌతీ పేర్కొన్నాడు.