IPL 2021: 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై చెన్నై గ్రాండ్‌‌ విక్టరీ

IPL 2021: 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై చెన్నై గ్రాండ్‌‌ విక్టరీ

  చెలరేగిన రుతురాజ్‌‌, డుప్లెసిస్‌‌

ఈసారి ఐపీఎల్‌‌లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ జైత్రయాత్ర కొనసాగిస్తుంటే.. హైదరాబాద్‌‌ మాత్రం పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్లకు కొదవలేకపోయినా.. కీలక టైమ్‌‌లో అద్భుతమైన ఆటతో చెలరేగిపోయిన సీఎస్‌‌కే.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో సన్‌‌రైజర్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 171/3 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 18.3 ఓవర్లలో 173/3 స్కోరు చేసి గెలిచింది. రషీద్‌‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. రుతురాజ్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

కీలక పార్ట్‌‌నర్‌‌షిప్‌‌

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన హైదరాబాద్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఊహించినంత వేగం, దూకుడు కనిపించలేదు. వార్నర్‌‌, బెయిర్‌‌స్టో (7) పవర్‌‌ప్లేను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఫోర్త్‌‌ ఓవర్లో  కరన్‌‌ (1/30) దెబ్బకు  బెయిర్‌‌స్టో ఔటవగా, మనీశ్​ పాండే, వార్నర్‌‌ భారీ షాట్లకు పోలేదు. దీంతో పవర్‌‌ప్లేలో 39/1 స్కోరు మాత్రమే వచ్చింది. ఫీల్డింగ్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ స్కోరు 69/1కు పెరిగింది. వార్నర్‌‌ మరీ నెమ్మదించినా.. పాండే ఒకటి, రెండు ఫోర్లతో ముందుకెళ్లాడు. స్కోరు తక్కువగా ఉండటంతో 15వ ఓవర్‌‌లో వార్నర్‌‌ ధైర్యం చేసి ఫస్ట్‌‌ సిక్సర్‌‌ బాదాడు. 11 నుంచి 15 ఓవర్లలో 44 రన్స్‌‌ రావడంతో ఇన్నింగ్స్‌‌ కాస్త మెరుగుపడింది. తర్వాతి ఓవర్‌‌లో సెకండ్‌‌ సిక్సర్‌‌తో రెచ్చిపోయిన వార్నర్‌‌ 50 బాల్స్‌‌లో,  పాండే 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు ఫినిష్‌‌ చేశారు. ఇక బ్యాట్లు ఝుళిపించే టైమ్‌‌ వచ్చేసిందనుకుంటున్న తరుణంలో 18వ ఓవర్‌‌లో ఎంగిడి డబుల్‌‌ షాకిచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేయడంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 106 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. విలియమ్సన్‌‌ (10 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 26 నాటౌట్‌‌) వరుసగా7 బాల్స్‌‌లో 4, 4, 6, 4, 4తో 24 రన్స్‌‌ చేసి జోష్‌‌ పెంచాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో కేదార్‌‌ జాదవ్‌‌ (12 నాటౌట్‌‌).. 4, 6 రాబట్టాడు. ఈ ఇద్దరూ 13 బాల్స్‌‌లో 37 రన్స్‌‌ జోడించడంతో  హైదరాబాద్‌‌ మంచి టార్గెట్‌‌నిర్దేశించింది.
 
ఇద్దరే.. ఇద్దరు

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సీఎస్‌‌కే ఓపెనర్లు రుతురాజ్‌‌, డుప్లెసిస్‌‌  స్టార్టింగ్‌‌ నుంచే దంచికొట్టారు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లో 5 రన్సే వచ్చినా.. సెకండ్‌‌ ఓవర్‌‌ నుంచి వీళ్ల అటాకింగ్‌‌ మొదలైంది. దీంతో హైదరాబాద్‌‌ బౌలర్లందరూ వీళ్లను కట్టడి చేయడంలో చేతులెత్తేశారు. ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో రన్‌‌రేట్‌‌ కూడా వేగంగా ముందుకెళ్లింది. 6 ఓవర్లలోనే  చెన్నై 50 రన్స్‌‌ చేసింది. ఏడో ఓవర్‌‌లో రుతురాజ్‌‌ రెండు ఫోర్లు బాదితే, 9వ ఓవర్‌‌లో డుప్లెసిస్‌‌ 6, 4తో జోరు పెంచాడు. ఓవర్‌‌కు ఒకటి, రెండు ఫోర్లు కొట్టడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో సీఎస్‌‌కే 91/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక ఇక్కడి నుంచి ఈ ఇద్దరి ఆట మరో మెట్టు ఎక్కింది. కౌల్‌‌ బాల్‌‌కు రెండు రన్స్‌‌ తీసి 32 బాల్స్‌‌లో డుప్లెసిస్‌‌ ఫిప్టీ కంప్లీట్‌‌ చేశాడు. రుతురాజ్‌‌ హ్యాట్రిక్​ ఫోర్లతో 36  బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 13వ ఓవర్‌‌లో మళ్లీ మూడు ఫోర్లు కొట్టి ఔటడంతో  ఫస్ట్‌‌ వికెట్‌‌కు 129 పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన మొయిన్‌‌ అలీ (15)ని, డుప్లెసిస్‌‌ను 15వ ఓవర్‌‌లో ఔట్‌‌ చేసి రషీద్‌‌ ఊరటనిచ్చాడు. కానీ,   రైనా (17 నాటౌట్‌‌), జడేజా (7 నాటౌట్‌‌) గెలుపు లాంఛనం పూర్తి చేశారు.

హైదరాబాద్‌‌: వార్నర్‌‌ (సి) జడేజా (బి) ఎంగిడి 57, బెయిర్‌‌స్టో (సి) చహర్‌‌ (బి) కరన్‌‌ 7, మనీష్‌‌ పాండే (సి) డుప్లెసిస్‌‌ (బి) ఎంగిడి 61, విలియమ్సన్‌‌ (నాటౌట్‌‌) 26 , కేదార్‌‌ జాదవ్‌‌ (నాటౌట్‌‌) 12, ఎక్స్‌‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 171/3. వికెట్లపతనం: 1–22, 2–128, 3–134. బౌలింగ్‌‌: దీపక్‌‌ చహర్‌‌ 3–0–21–0, సామ్‌‌ కరన్‌‌ 4–0–30–1, శార్దూల్‌‌ ఠాకూర్‌‌ 4–0–44–0, మొయిన్‌‌ అలీ 2–0–16–0, ఎంగిడి 4–0–35–2, జడేజా 3–0–23–0. 


చెన్నై: రుతురాజ్‌‌ (బి) రషీద్‌‌ 75, డుప్లెసిస్‌‌ (ఎల్బీ) రషీద్‌‌ 56, మొయిన్‌‌ అలీ (సి) జాదవ్‌‌ (బి) రషీద్‌‌ 15, జడేజా (నాటౌట్‌‌) 7, రైనా (నాటౌట్‌‌) 17, ఎక్స్‌‌ట్రాలు: 3, మొత్తం: 18.3 ఓవర్లలో 173/3. వికెట్లపతనం: 1–129, 2148, 3–148. బౌలింగ్‌‌: సందీప్‌‌ 3.3–0–24–0, ఖలీల్‌‌ అహ్మద్‌‌ 4–0–36–0, సిద్ధార్థ్‌‌ కౌల్‌‌ 4–0–32–0, సుచిత్‌‌ 3–0–45–0, రషీద్‌‌ 4–0–36–3.