మెరిసిన రైనా.. ఢిల్లీ టార్గెట్ 189

V6 Velugu Posted on Apr 10, 2021

ఐపీఎల్ 14 సీజన్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కు  189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. చెన్నైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 5, డుప్లెసిస్ డకౌట్ తో పెవిలియన్ చేరారు.  తర్వాత వచ్చిన మొయిన్ అలీ 36, సురేష్ రైనా 54 పరుగులతో రాణించారు. అంబటి రాయుడు 23, రవీంద్ర జడేజా 26 ,శామ్ కరణ్ 34  పరుగులు చేయడంతో చెన్నై188 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్,  క్రిస్ వోక్స్ కు చెరో 2,, అశ్విన్, టామ్ కరణ్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.

Tagged chennai superkings, raina

Latest Videos

Subscribe Now

More News