ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు అనుమతి

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు అనుమతి

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మొదలవనున్న ఐపీఎల్ ఫేజ్ 2ను లైవ్‌లో చూసేందుకు అనుమతించనున్నారు. పరిమిత సంఖ్యలో అభిమానులను స్టేడియాలకు అనుమతిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈ నెల 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ ఫేజ్ 2 మ్యాచ్‌లకు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబు దాబీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వేదికల్లో లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీతో  మ్యాచ్‌లు చూసేందుకు ఫ్యాన్స్‌‌ను అనుమతించనున్నారు. సెప్టెంబర్ 16 నుంచి www.iplt20.comతోపాటు PlatinumList.netలో టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా, గత ఐపీఎల్ కూడా యూఏఈలోనే జరగ్గా..  కరోనా దృష్ట్యా ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి ఆడియన్స్ మధ్య మ్యాచ్‌లు మరింత వినోదాన్ని పంచుతాయనడంలో సందేహం లేదు.