చెన్నైని ఢీకొట్టేదెవరు?..ఇవాళ ఢిల్లీ, కోల్‌కతా మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్

చెన్నైని ఢీకొట్టేదెవరు?..ఇవాళ ఢిల్లీ, కోల్‌కతా మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్

షార్జా: ఐపీఎల్‌‌‌‌లో తొలి టైటిల్‌‌‌‌పై  కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ మరో కఠిన సవాల్‌‌‌‌కు రెడీ అయింది. వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగు పెట్టేందుకు రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ కెప్టెన్సీలోని క్యాపిటల్స్ బుధవారం జరిగే క్వాలిఫయర్‌‌‌‌–2లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్‌‌‌‌–1లో చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీకి ఫైనల్‌‌‌‌ చేరాలంటే ఇందులో మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇక రెండుసార్లు టైటిల్‌‌‌‌ విన్నర్‌‌‌‌ కేకేఆర్‌‌‌‌ రెండేళ్ల గ్యాప్‌‌‌‌ తర్వాత  ప్లేఆఫ్స్‌‌‌‌లో అడుగు పెట్టింది. ఎలిమినేటర్‌‌‌‌లో విరాట్‌‌‌‌ కోహ్లీ ఆశలపై నీళ్లు కుమ్మరించి మూడో టైటిల్‌‌‌‌ రేసులో నిలిచిన ఆ జట్టు ఇప్పుడు ఫుల్‌‌‌‌జోష్‌‌‌‌లో ఉంది. బలమైన లైనప్‌‌‌‌తో పాటు గత మూడు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గిన మోర్గాన్‌‌‌‌ కెప్టెన్సీలోని కేకేఆర్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగనుండగా.. లాస్ట్‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన ఢిల్లీపై ప్రెజర్‌‌‌‌ ఉంది. ఇంకోవైపు ఈ మ్యాచ్‌‌‌‌ జరిగే షార్జా స్టేడియంలో స్లో వికెట్‌‌‌‌ సవాల్‌‌‌‌ విసురుతోంది. మరి ఈ పోరులో గెలిచి శుక్రవారం జరిగే ఫైనల్లో చెన్నైని ఢీకొట్టేదెవరో చూడాలి. 

మూడో టైటిల్‌‌‌‌ వేటలో..

ఇండియా లెగ్‌‌‌‌లో నిరాశపర్చినా.. యూఏఈలో అద్భుతంగా ఆడుతున్న నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ మూడో టైటిల్‌‌‌‌పై కన్నేసింది. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌,  రాహుల్‌‌‌‌ త్రిపాఠి, నితీశ్‌‌‌‌ రాణా, శివమ్‌‌‌‌ మావి, వరుణ్‌‌‌‌ చక్రవర్తితో పాటు విండీస్‌‌‌‌ మిస్టరీ స్పిన్నర్‌‌‌‌ సునీల్‌‌‌‌ నరైన్‌‌‌‌, ఫెర్గూసన్‌‌‌‌  నిలకడగా ఆడుతూ జట్టును గెలిపిస్తున్నారు. ఫేజ్‌‌‌‌–2లో యంగ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వడంతోనే  కేకేఆర్‌‌‌‌ రాత మారిందనొచ్చు. ఫియర్‌‌‌‌లెస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో అయ్యర్‌‌‌‌ మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. గిల్‌‌‌‌, త్రిపాఠి, రాణా కూడా సత్తా చాటుతుండగా.. బౌలింగ్‌‌‌‌లో మావి, వరుణ్, నరైన్‌‌‌‌ బాధ్యత తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్లో పిచ్‌‌‌‌లపై స్పిన్‌‌‌‌ ద్వయం వరుణ్‌‌‌‌ (16 వికెట్లు), నరైన్ (14 వికెట్లు) అదరగొడుతున్నారు. బాల్‌‌‌‌తోనే కాకుండా నరైన్‌‌‌‌ ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కేకేఆర్‌‌‌‌కు అదనపు బలం. గత మ్యాచ్‌‌‌‌ జోరును కొనసాగిస్తే ఢిల్లీని అడ్డుకొని మూడో టైటిల్‌‌‌‌ కోసం ముందుకెళ్లడం కేకేఆర్‌‌‌‌కు పెద్ద కష్టమేం కాబోదు. 
 

ఢిల్లీకి సమస్యలు.. 

2019లో మూడో ప్లేస్‌‌లో నిలిచిన ఢిల్లీ లాస్ట్‌‌ ఇయర్‌‌ ఫైనల్‌‌ చేరుకుంది. అదే జోరు ఈ సీజన్‌‌లోనూ కొనసాగిస్తూ  లీగ్‌‌లో పది విజయాలతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. అయితే కీలక టైమ్‌‌లో నిలకడగా ఆడలేకపోవడం ఢిల్లీ బలహీనత. మరి ఈ మ్యాచ్‌‌లో దానిని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఆర్‌‌సీబీపై నిరాశపర్చిన ధవన్‌‌, శ్రేయస్‌‌.. బ్యాట్‌‌ ఝుళిపించాలని మేనేజ్‌‌మెంట్‌‌ ఆశిస్తోంది. పృథ్వీ, పంత్‌‌, హెట్‌‌మయర్‌‌ జోరు కొనసాగిస్తే  టీమ్‌‌కు తిరుగుండదు. పేసర్లు అన్రిచ్‌‌ నోర్జ్‌‌, అవేశ్‌‌ ఖాన్‌‌ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ  గత నాలుగు మ్యాచ్‌‌ల్లో ఒక్క వికెట్‌‌ కూడా తీయని స్టార్‌‌ పేసర్‌‌ రబాడ ఫామ్‌‌ అందుకోకపోతే ఢిల్లీ ముందంజ వేయలేదు. గాయపడ్డ  ఆల్‌‌రౌండర్‌‌  స్టోయినిస్‌‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతని సేవలు ఢిల్లీకి ఇప్పుడు అత్యవసరం. ఈ మ్యాచ్‌‌కు తను ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తే టామ్‌‌ కరన్‌‌ ప్లేస్‌‌లో బరిలోకి దిగనున్నాడు. 

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ: పృథ్వీ షా, ధవన్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌, కీపర్‌‌‌‌), హెట్‌‌‌‌మయర్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌ /టామ్‌‌‌‌ కరన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, అశ్విన్‌‌‌‌, రబాడ, నోర్జ్‌‌‌‌, అవేశ్‌‌‌‌ఖాన్​.

కోల్‌‌‌‌కతా: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్​, రాహుల్‌‌‌‌ త్రిపాఠి, రాణా, కార్తీక్‌‌‌‌ (కీపర్), మోర్గాన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), షకీబ్‌‌‌‌, నరైన్‌‌‌‌, ఫెర్గూసన్‌‌‌‌, చక్రవర్తి, 
శివమ్‌‌‌‌ మావి.