బెంగళూరుకు సన్‌‌ స్ట్రోక్‌‌

బెంగళూరుకు సన్‌‌ స్ట్రోక్‌‌
  • 4 రన్స్‌‌ తేడాతో హైదరాబాద్‌‌ విక్టరీ
  •     రాణించిన రాయ్‌‌, కేన్​

అబుదాబి: లీగ్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌లో చతికిలపడిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌.. ఆఖర్లో రాణిస్తోంది. ప్లే ఆఫ్స్‌‌‌‌ రేసు నుంచి వైదొలిగిన  రైజర్స్ ఊరట విజయాలతో ప్రత్యర్థులకు షాకిస్తోంది. బౌలర్లు సమష్టిగా పోరాడటంతో లో స్కోరింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బెంగళూరుకు అద్భుతంగా చెక్‌‌‌‌ పెట్టింది. దీంతో బుధవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 4  రన్స్​ తేడాతో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ను ఓడించింది. తొలుత హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 141/7 రన్స్‌‌‌‌ చేసింది. ఓపెనర్​ జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌ (38 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 44), కెప్టెన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ (29 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 31) రాణించారు. ఆర్​సీబీ బౌలర్లలో హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (3/33), డాన్​ క్రిస్టియన్‌‌‌‌ (2/14) రైజర్స్‌‌‌‌ను కట్టడి చేశారు. తర్వాత ఛేజింగ్​లో బెంగళూరు 20 ఓవర్లలో 137/6 స్కోరుకే పరిమితమైంది. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (41), మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (40) రాణించినా ఫలితం లేకపోయింది. కేన్​కు కు ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 
హర్షల్‌‌‌‌ హల్‌‌‌‌చల్‌‌‌‌..
టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన హైదరాబాద్‌‌‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్టింగ్‌‌‌‌లోనే 4, 6తో జోరు చూపెట్టిన అభిషేక్‌‌‌‌ శర్మ (13) సెకండ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే ఔటయ్యాడు. అయితే, థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లతో విలియమ్సన్‌‌‌‌ టచ్‌‌‌‌లోకి రాగా, రాయ్‌‌‌‌ కూడా బౌండ్రీల జోరు చూపెట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో 50/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత ఈ ఇద్దరు భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశారు. ఫలితంగా పది ఓవర్లలో  హైదరాబాద్‌‌‌‌ 76/1తో మంచి స్థితిలోనే కనిపించింది. ఈ టైమ్‌‌‌‌లో సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌కు వచ్చిన హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌.. రైజర్స్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను డ్యామేజ్‌‌‌‌ చేశాడు. 12వ ఓవర్‌‌‌‌లో ఓ గుడ్‌‌‌‌లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో విలియమ్సన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో క్రిస్టియాన్‌‌‌‌, చహల్‌‌‌‌ కలిపి ట్రిపుల్‌‌‌‌ షాకిచ్చారు. భారీ సిక్సర్‌‌‌‌తో జోరుమీద కనిపించిన ప్రియమ్‌‌‌‌ గార్గ్‌‌‌‌ (15)తో పాటు రాయ్‌‌‌‌ను క్రిస్టియన్‌‌‌‌ 15వ ఓవర్‌‌‌‌లో వెనక్కిపంపాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో చహల్‌‌‌‌.. అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌ చేశాడు. ఏడు బాల్స్‌‌‌‌ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో హైదరాబాద్‌‌‌‌ 107/5 స్కోరుతో కష్టాల్లో పడింది. లాస్ట్‌‌‌‌లో సాహా (10), హోల్డర్‌‌‌‌ (16) ఆదుకునే ప్రయత్నం చేసినా హర్షల్‌‌‌‌.. తన వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని ఔట్‌‌‌‌ చేయడంతో రైజర్స్​ తక్కువ స్కోరే చేసింది.
కొంప ముంచిన రనౌట్‌‌‌‌
మోస్తరు టార్గెట్‌‌‌‌ ఛేదనలో బెంగళూరు ఆరంభం కలిసి రాలేదు. ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన కోహ్లీ (5) ఆరో బాల్‌‌‌‌కు ఔటయ్యాడు. పడిక్కల్‌‌‌‌ రెండు ఫోర్లు బాదినా.. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోక్రిస్టియన్‌‌‌‌ (1)ను కౌల్‌‌‌‌ వెనక్కి పంపడంతో ఆర్‌‌‌‌సీబీ 18/2తో కష్టాల్లో పడింది. శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌ (12) కూడా నిరాశపర్చడంతో స్కోరు 38/3గా మారింది. ఇక ఇన్నింగ్స్‌‌‌‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్న మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. రషీద్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు సూపర్‌‌‌‌ సిక్సర్లతో పాటు ఫోర్లూ బాదాడు. దీంతో  పవర్‌‌‌‌ప్లేలో 37/2 ఉన్న ఆర్‌‌‌‌సీబీ స్కోరు 10 ఓవర్లలో 67/3కి చేరింది. రెండో ఎండ్‌‌‌‌లో పడిక్కల్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసినా, మ్యాక్సీ మాత్రం ఫోర్ల జోరు తగ్గనీయలేదు. దీంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 14 ఓవర్లలో 92/3తో మంచి స్థితిలో ఉన్న టైమ్‌‌‌‌లో తర్వాతి ఓవర్‌‌‌‌లో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. ఫలితంగా ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. డివిలియర్స్‌‌‌‌ (19) కుదురుకోవడానికి టైమ్‌‌‌‌ తీసుకున్నా.. 17వ ఓవర్‌‌‌‌లో పడిక్కల్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు చేరాడు. గెలవాలంటే 18 బాల్స్‌‌‌‌లో 29 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో  షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (14) రెండు ఫోర్లు కొట్టి 19వ ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌కావడంతో విక్టరీ ఈక్వేషన్‌‌‌‌ 6 బాల్స్‌‌‌‌లో 13 రన్స్‌‌‌‌గా మారింది. క్రీజులో ఉన్న గార్టన్‌‌‌‌ (2 నాటౌట్‌‌‌‌) సింగిల్‌‌‌‌, ఏబీ ఓ సిక్సర్‌‌‌‌ కొట్టినా టీమ్‌‌‌‌ను గెలిపించలేకపోయారు. 
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 141/7 (రాయ్‌‌‌‌ 44, కేన్​31, హర్షల్‌‌‌‌ 3/33, డాన్ క్రిస్టియన్‌‌‌‌ 2/14), 
బెంగళూరు: 20 ఓవర్లలో 137/6 ( పడిక్కల్‌‌‌‌ 41, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ 40, ఉమ్రన్​ 1/21 ).
 

ఐపీఎల్​ 14లో ఆర్​సీబీ బౌలర్​  హర్షల్‌‌‌‌ పటేల్​ తీసిన వికెట్లు. 
ఓ సీజన్​లో​ ఎక్కువ వికెట్లు తీసిన ఇండియన్​గా తను బుమ్రా (27) రికార్డు బ్రేక్​ చేశాడు.