లక్నోతో మ్యాచ్.. KKR టార్గెట్-177

లక్నోతో మ్యాచ్.. KKR టార్గెట్-177

ఐపీఎల్ -2022లో భాగంగా ఇవాళ కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో  నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. సౌథీ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో  నాలుగు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి హోల్డ‌ర్ (13)ను పెవిలియ‌న్‌కు పంపాడు. ఆఖ‌రి బంతికి చ‌మీరా (0) ర‌నౌట‌య్యాడు. ల‌క్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (50), హుడా (41), స్టోయినిస్ (28) రాణించ‌గా.. కేకేఆర్ బౌల‌ర్ల‌లో ర‌సెల్ 2, సౌథీ, శివ‌మ్ మావి, న‌రైన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 15వ ఓవర్ల తర్వాత తగ్గుతూ వచ్చిన లక్నోను స్టోయినిస్ ఆదుకున్నాడు. 19వ ఓవర్లలో వరుసగా 3 సిక్సులు కొట్టి ఔట్ కాగా.. ఆ ఓవర్లో మొత్తం 30 రన్స్ వచ్చాయి.