
ముంబై: ఐపీఎల్15ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన రైజర్స్ ఎనిమిదో ప్లేస్‌తో సరిపెట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో రైజర్స్‌ను ఓడించి ఆరో ప్లేస్ సాధించింది. తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (32 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 43) ఆకట్టుకున్నాడు. చివర్లో సుందర్ (25), షెఫర్డ్ (26 నాటౌట్) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ (3/26), ఎలిస్ (3/40) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్ లో 15.1 ఓవర్లలోనే 160/5 స్కోరు చేసిన పంజాబ్ ఈజీగా గెలిచింది. లివింగ్‌స్టోన్ (22 బాల్స్ లో 2 ఫోర్లు, 5 సిక్స్ లతో 49 నాటౌట్)తో పాటు ధవన్ (32 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39) రాణించాడు. ఫరూఖి (2/32) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. హర్‌ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కాగా, మంగళవారం గుజరాత్, రాజస్తాన్ మధ్య కోల్‌కతాలో క్వాలిఫయర్–1 మ్యాచ్ జరుగుతుంది.