జనగామ అర్బన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల అధికారుల విధుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతి అంశంపై పర్యవేక్షించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
