ఎర్త్స్ రొటేషన్ డే 2026: ఈ తేదీకి చరిత్ర, ప్రాముఖ్యత, దానిని ఎందుకు జరుపుకుంటాం అంటే ?

ఎర్త్స్ రొటేషన్ డే 2026: ఈ తేదీకి చరిత్ర, ప్రాముఖ్యత, దానిని ఎందుకు జరుపుకుంటాం అంటే ?

భూమి భ్రమణ దినోత్సవం(Earth’s Rotation Day) ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్ట్ చేసిన ఆవిష్కరణను గుర్తుచేస్తుంది. 1851లో  ఫౌకాల్ట్ భూమి దాని అక్షం(its axis) మీద తిరుగుతుందని నిరూపించాడు, దీనిని ఫౌకాల్ట్ పెండులం అని పిలుస్తారు. ఫౌకాల్ట్ పెండులం అనేది ఒక కాంప్లెక్స్  పరికరం, భూమి ఒక బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. దీనినే 'భ్రమణం' అంటారు. భూమి ఇలా ఒకసారి పూర్తిగా చుట్టి రావడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. భూమి ఇలా తిరగడం వల్లనే మనకు పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. దీనినే మనం ఒక పూర్తి రోజుగా పిలుచుకుంటాము.

జనవరి 8నే ఎందుకు?
భూమి భ్రమణాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు, పండితులు ఇంకా సాధారణ ప్రజల సమక్షంలో పారిస్‌లోని పాంథియోన్‌లో ఫౌకాల్ట్ పెండులం ప్రదర్శించిన రోజును  పురస్కరించుకుని జనవరి 8న భూమి భ్రమణ దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటాము. 2026 నాటికి ఈ పెండులం ప్రదర్శనకు 175 ఏళ్ళు.

భూమి భ్రమణ దినోత్సవం చరిత్ర
భూమి దాని చుట్టూ అది బొంగరంల తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం  మన రాత్రి పగలుని ఎలా ప్రభావితం చేస్తాయో వేల సంవత్సరాలుగా మానవులను కలవరపెడుతోంది. గ్రీస్‌లోని పొంటస్‌కు చెందిన హెరాక్లైడ్స్ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో భూమి దాని అక్షం మీద తిరుగుతుందని సూచించిన మొట్టమొదటి వారిలో ఒకరు. అయితే, 5వ శతాబ్దం CEలో ఆర్యభట్ట రచనలలో భూమి దాని అక్షం మీద తిరుగుతుందని, నక్షత్రాల స్పష్టమైన కదలిక గురించి పాత  సిద్ధాంతాలు ఉన్నాయి. 

ఐరోపాలో 1500లో నికోలస్ కోపర్నికస్ మొదట భూమి దాని చుట్టూ అది తిరుగుతూ, సూర్యుని చుట్టూ గుండ్రని కక్ష్యలలో తిరుగుతుందని ప్రతిపాదించాడు. తరువాత 1609లో జర్మన్ గణిత శాస్త్రజ్ఞుడు జోహన్నెస్ కెప్లర్ భూమి గుండ్రటి కక్ష్యలో తిరగదని కానీ పొడవైన వృత్తాకార కక్ష్యలో తిరుగుతుందని గణిత నమూనాను అందించాడు. తరువాత గెలీలియో  సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని పరిశీలనలతో సమర్ధించాడు. కానీ లియోన్ ఫౌకాల్ట్ pendulum ప్రయోగంతో భూమి ఒక అక్షం మీద కదులుతుందని నిరూపించే వరకు ఖచ్చితమైన ప్రయోగాత్మక రుజువు లేదు. ఫౌకాల్ట్ మొదట పారిస్ అబ్జర్వేటరీలో తరువాత పాంథియోన్‌లో తన పెండులం ప్రయోగాన్ని నిర్వహించాడు. 

ఫౌకాల్ట్ చేసిన పరిశీలనలు, ప్రయోగాలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో రహస్యాలను ఆవిష్కరించాయి. వాతావరణ నమూనాలు ఇంకా సముద్రపు అలల కదలికలను అధ్యయనం చేయడానికి వీలైంది.  ఆకాశంలో సూర్యుడు, నక్షత్రాల స్పష్టమైన కదలికను అధ్యయనం చేయడానికి ఒక ఆధారాన్ని కూడా అందించింది.