కాశీబుగ్గ, వెలుగు: మేడారం జాతర - 2026 టీజీఎస్ఆర్టీసీ పటిష్ట ఏర్పాట్లతో పాటు విస్తృతంగా ఏర్పాటు చేస్తుందని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ పి.సోలోమన్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆర్టీసీ మేడారం జాతర సమావేశంలో కరీంనగర్ జోన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్, రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ రీజియన్ల ట్రాఫిక్ మెయింటెనెన్స్ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బస్సుల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెయింటనెన్స్ అధికారులను ఆదేశించారు.
