అమెరికాలో భారీగా కొకైన్ అక్రమ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్ట్

అమెరికాలో భారీగా కొకైన్ అక్రమ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సెమీ ట్రక్కులో కొకైన్ తరలిస్తుండగా ఇండియానా రాష్ట్రంలో పుట్నం కౌంటీలో భారత్ కు చెందిన గురుప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్‌ లను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు.ట్రక్కులో  స్లీపర్ బెర్త్ లో దాచి గుట్టుగా రవాణా చేస్తున్న 309పౌండ్లు(140కిలోలు) కొకైన్ ను స్వాధీనం చేస్తున్నారు. 

నిందితుల్లో గుర్ ప్రీత్ సింగ్ 2023లో  అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు జస్వీర్ సింగ్  2017లో  కాలిఫోర్నియాలోని మోసా ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుర్ ప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్ లను పుట్నా కౌంటీ జైలుకు తరలించారు. పట్టుబడ్డ కొకైన్ తో  1లక్షా 13వేల మంది అమెరికన్లను చంపేయొచ్చంటూ పోలీసులు ఆరోపించారు.