స్టేడియంలో వెక్కి వెక్కి ఏడ్చిన చెన్నై ఫ్యాన్స్

స్టేడియంలో వెక్కి వెక్కి ఏడ్చిన చెన్నై ఫ్యాన్స్

'చెన్నై- ధోని..' ఈ బంధం విడదీయరానిది. నిజానికి ధోని సొంతూరు ఝార్ఖండ్ అయినా.. అందరికి గుర్తొచ్చేది మాత్రం.. చెన్నైయే. ఐపీఎల్ టోర్నీ వల్లే అది సాధ్యమైంది. 2008లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కెప్టెన్ కూల్ 14 సీజన్ల పాటు సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ ప్రయాణంలో ఎన్నో మరుపురాని విజయాలు, జ్ఞాపకాలు అతని సొంతం. అందుకే సీఎస్‌కే అభిమానులు అతనిని 'తాలా' అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. అతనిపై వారికి అంతటి అభిమానం ఉంది.

నిజానికి అహ్మదాబాద్.. గుజరాత్ సొంత మైదానం అయినా సీఎస్‌కే జెండాలు రెపరెపలాడాయి. గుజరాత్ అభిమానులు సైతం చెన్నై అభిమానులుగా మారిపోయారు. మహేంద్రుడికి చివరి ఐపీఎల్ మ్యాచ్ అని పుకార్లు వ్యాపించడంతో ప్రాంగణమంతా ఎమోషన్స్‌తో నిండిపోయింది. చెన్నై విజయానికి ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కావడంతో, మ్యాచ్ గుజరాత్‌దే అని అంతా అనుకున్నారు. ఆ సమయంలో చెన్నై ఫ్యాన్స్ వెక్కి వెక్కి ఏడ్చారు. మహేంద్రుడికి సరైన ముగింపు లభించదేమో అని బాధపడ్డారు. ఒక్కసారిగా మైదానమంతా నిశ్శబ్దం అలుముకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

https://twitter.com/garam_mizaaj/status/1663276852159578112

https://twitter.com/IPL/status/1663364200838856704