మీతో కలిసి ఆడాలన్నది నా కల..ముంబై కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌తో తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ

మీతో కలిసి ఆడాలన్నది నా కల..ముంబై కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌తో తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మతో కలిసి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలన్న తన చిన్ననాటి కల నెరవేరిందని ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌,హైదరాబాదీ తిలక్ వర్మ చెప్పాడు. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌తో కీలక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ చేసిన తిలక్ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముంబై తొలి విజయంలో భాగమయ్యాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత తిలక్‌‌‌‌‌‌‌‌ను రోహిత్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూ చేశాడు. తన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, గాయాలు, సీజన్‌‌‌‌‌‌‌‌లో జట్టు తొలి విజయం గురించి రోహిత్‌‌‌‌‌‌‌‌ అడిగిన ప్రశ్నలకు తిలక్ సమాధానం చెప్పాడు.

‘మీతో కలిసి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నది నా చిన్ననాటి కల. అందుకు  ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా. ఈ రోజు (మంగళవారం) ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నా. మీతో కలిసి మంచి పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ నమోదు చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది’ అని తిలక్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు.గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో తనకు గాయం అయినప్పుడు కూడా జట్టు కోసమే ఆలోచించానని తిలక్​​ తెలిపాడు. ‘నాకు గాయం అయినప్పుడు మెంటల్‌‌‌‌‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాను. మళ్లీ జట్టులోకి రావాలి... టీమ్‌‌‌‌‌‌‌‌ కోసం నా బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలనే ఆలోచించా. ఆ దిశగానే ఈ సీజన్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యా. గతేడాది నా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేదు కాబట్టి ఈసారి జట్టును ఎలా గెలిపించాలో ఆలోచించాను’ అని  తిలక్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు.