IPL 2024: నేడు పంజాబ్ తో ముంబై ఢీ.. గెలుపెవరిదో?

 IPL 2024:  నేడు పంజాబ్ తో ముంబై ఢీ.. గెలుపెవరిదో?

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 17వ సీజన్ మరో కీలక పోరు జరగనుంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 18వ తేదీ గురువారం ముంబై ఇండియన్స్‌తో  పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. ఈ సీజన్ లో ఇప్పటివరకు రెండు జట్టు చెరో ఆరు మ్యాచ్ లు ఆడగా.. రెండింటిలో గెలుపొందాయి. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలో ఉండగా.. ముంబై 9వ స్థానంలో ఉంది. 

ఇరుజట్లకు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానానాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా ముంబై, పంజాట్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.

గత, మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమి చెందిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని పట్టదలగా ఉంది. మరోవైపు,  చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన ముంబై కూడా ఈ మ్యాచ్ ద్వారా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.  పంజాబ్‌పై విజయం సాధించిన ఈ సీజన్ లో తమ మూడవ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.  

ముంబైలో హిట్టర్లకు కొదవ లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే బ్యాట్స్ మెన్స్ ఆ  జట్టులో ఉన్నారు. ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి వ్యాచ్ విన్నర్లు చెలరేగితే ముంబై విజయాన్ని అడ్డుకోవడం పంజాబ్ కు కష్టమే. ఇక, బౌలింగ్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నా.. మిగతా బౌలర్లు దారుళంగా పరుగులు ఇస్తుండడం ముంబైని కలవరపెడుతోంది.

ఇక, పంజాబ్ విషయానికి వస్తే.. జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మలు బ్యాటింగ్ లో రాణించడంతోపాటు హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడలు బౌలింగ్ లో చెలరేగితో ముంబైని ఓడించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 

అయితే,  ఐపీఎల్ లో పంజాబ్ పై ముంబైదే పై చెయి. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఇరుజట్టు 31 సార్లు తలపడగా.. ఇందులో ముంబై 16 మ్యాచ్ ల్లో, పంజాబ్ 15 మ్యాచ్ ల్లో గెలుపొందాయి.  మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

 జట్ల అంచనా:

పంజాబ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్/అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: అశుతోష్ శర్మ

ముంబై జట్టు: ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, మహ్మద్ నబీ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా

ఇంపాక్ట్ ప్రత్యామ్నాయం: ఆకాష్ మధ్వల్