PBKS vs RR: రాజస్థాన్ vs పంజాబ్.. గెలిచే జట్టేది..?

PBKS vs RR: రాజస్థాన్ vs పంజాబ్.. గెలిచే జట్టేది..?

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. చండీఘర్ లోని ముల్లాన్ పూర్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లు తాము ఆడిన చివరి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో రెండు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. 

రాజస్థాన్ రాయల్స్:

టోర్నీలో లో రాజస్థాన్ కు తిరుగులేకుండా పోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్ ల గెలుపు తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్  విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఫామ్ లో ఉన్నారు. జైస్వాల్ గాడిలో పడితే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో బౌల్ట్ పవర్ ప్లే లో వికెట్లు తీస్తూ జట్టుకు శుభారంభం ఇస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో అశ్విన్, చాహల్ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. 

పంజాబ్ కింగ్స్:

శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ తప్ప పంజాబ్ జట్టులో చెప్పుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది. లోయర్ ఆర్డర్ లో వీరిద్దరూ అద్భుతంగా ఆడుతుండడం పంజాబ్ జట్టుకు సానుకూల అంశం. కెప్టెన్ శిఖర్ ధావన్ టోర్నీ ప్రారంభంలో బాగా ఆడినా ఆ తర్వాత లయ కోల్పోయాడు. జానీ బెయిర్ స్టో ఘోరంగా విఫలమవుతుండగా.. సామ్ కరన్ పర్వాలేదనిపిస్తున్నాడు. టాపార్డర్ గాడిలో పడితే పంజాబ్ కు తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అర్ష దీప్ సింగ్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. హర్షల్ పటేల్, రబడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. పంజాబ్ గెలవాలంటే వీరిద్దరూ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్ లాడితే  రెండు మ్యాచ్ లో విజయం సాధించింది.     

ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉండడంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతుండడం.. బ్యాటింగ్ డెప్త్ ఉండడం పంజాబ్ కు కలిసి వస్తుంది. రాజస్థాన్ కు 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటే.. పంజాబ్ కు 40 శాతం అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు (అంచనా ):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ , హర్షల్ పటేల్ , అర్ష్‌దీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (అంచనా ):

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్ , ధృవ్ జురెల్, ఆర్ అహ్ష్విన్, ట్రెంట్ బౌల్ట్ , యుజ్వేంద్ర చాహల్ , అవేష్ ఖాన్ , నాంద్రే బర్గర్, కుల్దీప్ సేన్.