RR vs MI: రాజస్థాన్ vs ముంబై.. గెలిచే జట్టేది..?

RR vs MI: రాజస్థాన్ vs ముంబై.. గెలిచే జట్టేది..?

ఐపీఎల్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం 

రాజస్థాన్ రాయల్స్:

టోర్నీలో రాజస్థాన్ కు తిరుగులేకుండా పోతుంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తప్ప రాజస్థాన్ అన్ని మ్యాచ్ ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్ లో బట్లర్, సంజు శాంసన్, పరాగ్ అదరగొడుతున్నారు. యువ ప్లేయర్ జైస్వాల్ చెలరేగితే రాజస్థాన్ కు తిరుగుండదు. మరో వైపు బౌలింగ్ అత్యంత దుర్బేధ్యంగా కనిపిస్తుంది. బోల్ట్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ లతో కూడిన పేస్ త్రయం.. చాహల్, అశ్విన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు రాజస్థాన్ సొంతం. స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 

ముంబై ఇండియన్స్:

టోర్నీ ప్రారంభంలో వరుస పరాజయాలు పలకరించినా.. క్రమంగా ముంబై పుంజుకుంది. చివరి నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని కొడకట్టుకుంది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ రాణిస్తున్నారు. కిషాన్ పవర్ ప్లే వరకు ఉన్నా.. పర్వాలేదనిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్య ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఒక్కడే ప్రభావం చూపిస్తున్నాడు. మిగిలిన బౌలర్లు విఫలం కావడం ముంబై శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. కొయెట్జ్, ఆకాష్ మద్వాల్ వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. బౌలింగ్ మెరుగుపర్చుకుంటే ఈ మ్యాచ్ లో ముంబై గెలవొచ్చు. 

ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్.. సొంతగడ్డపై ఆడుతుండడం కలిసి వస్తుంది. మరోవైపు ముంబై బౌలింగ్ లో రాణించగలిగితే రాజస్థాన్ కు షాక్ ఇవ్వొచ్చు. మరి ఎవరు గెలిచి తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకుంటారో చూడాలి. ఇరు జట్ల మధ్య ఈ సీజన్ లో ఒక మ్యాచ్ జరిగితే రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ముంబై ప్లేయింగ్ 11 (అంచనా )

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా

రాజస్థాన్ ప్లేయింగ్ 11 (అంచనా)

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్