IPL 2028: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2028) మెగా వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, రిటెన్షన్ ధరలపై వస్తున్న సంచలన వార్తలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2028 మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీలు తమను అట్టిపెట్టుకోవాలంటే (Retention) ఏకంగా రూ. 40 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు రావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయోమయంలో పడ్డాయి. ఒక్క ప్లేయర్‌కే రూ. 40 కోట్లు ఇవ్వాల్సి వస్తే, జట్టు సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది.
రూ. 40 కోట్ల డిమాండ్‌కు కారణం ఇదే:
* ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లకు లభించిన భారీ డిమాండ్‌ను చూసిన కొందరు దిగ్గజ ప్లేయర్లు, తమను వేలానికి ముందు రిటైన్ చేసుకోవాలంటే రూ. 40 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రూ. 120 కోట్లుగా ఉన్న పర్స్ బ్యాలెన్స్, మెగా వేలం నాటికి రూ. 150 కోట్లకు చేరే ఛాన్స్ ఉండటంతో ఆటగాళ్లు తమ మార్కెట్ వాల్యూని భారీగా పెంచేశారు.
ఫ్రాంచైజీల ముందున్న పెద్ద సవాళ్లు:
* బడ్జెట్ సంక్షోభం: ఒక్క ప్లేయర్‌కే రూ. 40 కోట్లు (మొత్తం పర్సులో 1/4 వంతు) ఇస్తే మిగిలిన 20,22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడం మ్యాచ్ విన్నింగ్ టీమ్‌ను నిర్మించడం చాలా కష్టమైతుంది.
* టీమ్ బ్యాలెన్స్: నాణ్యమైన విదేశీ, భారత్ ఆల్‌రౌండర్లు, బౌలర్లను వేలంలో దక్కించుకోవడానికి ఆ పర్స్ సరిపోకపోవచ్చు.
ఐపీఎల్ 2027 మిని వేలం, ట్రేడింగ్ అప్‌డేట్స్:
* మెగా వేలం మాట పక్కనబెడితే, వచ్చే నెల డిసెంబర్ 16, 2026న గోవా వేదికగా ఐపీఎల్ 2027 మిని వేలం జరగబోతుంది. దీనికి ముందు బీసీసీఐ రిటెన్షన్స్ గడువును నవంబర్ 17వ తేదీ వరకు పొడిగించింది.
ఇప్పటికే పూర్తైనా ఆయా జట్ల ట్రేడింగ్:
* ఢిల్లీ - లక్నో బిగ్ ట్రేడ్: రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరుకోగా, కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ అయ్యాడు.
* SRH - DC ట్రేడ్: ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి చేరగా, బదులుగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు.
* CSK - SRH బిగ్ డీల్: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి లియామ్ లివింగ్‌స్టన్ (రూ. 6 కోట్లు తగ్గించిన ధర), జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కేకి రాగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లు ఎస్ఆర్‌హెచ్‌లోకి వెళ్లారు.
