ఎలిమినేషన్ ఎవరికో!..నేడు సన్ రైజర్స్ vs ఢిల్లీ

ఎలిమినేషన్ ఎవరికో!..నేడు సన్ రైజర్స్ vs ఢిల్లీ

అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకున్న సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది.  విశాఖపట్నంలో తెలుగు అభిమానుల మధ్య ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరుగుతుండడం ఆరెంజ్‌‌‌‌‌‌‌‌ఆర్మీకి సానుకూలంగా మారింది. నాకౌట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించడం గాలివాటం కాదని, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నెగ్గి రెండో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించిన ఢిల్లీ.. ఈమ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలుపొంది ఫైనల్‌‌‌‌‌‌‌‌ వైపు అడుగేయాలని భావిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడిన జట్టు లీగ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎలిమినేట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది.

ఫామ్‌‌‌‌‌‌‌‌లో విలియమ్సన్‌‌‌‌‌‌‌‌

రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేన్‌‌‌‌‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. గతేడాది టోర్నీలో మెరుపులు మెరిపించిన కేన్‌‌‌‌‌‌‌‌.. ఈ ఏడాది తనదైన ముద్ర వేయలేకపోయాడు. అయితే కీలకమైన నాకౌట్‌‌‌‌‌‌‌‌కు ముందు అతను ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంపై టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ఆనందం వ్యక్తం చేస్తోంది. విధ్వంసక ఓపెనర్లు డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌, జానీ బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో దూరమైన నేపథ్యంలో  వారి స్థానంలో మార్టిన్‌‌‌‌‌‌‌‌ గప్టిల్‌‌‌‌‌‌‌‌, వృద్ధిమాన్‌‌‌‌‌‌‌‌ సాహా సత్తాచాటాల్సిన అవసరముంది. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో దక్కిన శుభారంభాలను వీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో మనీశ్‌‌‌‌‌‌‌‌ పాండే మాత్రమే రాణిస్తున్నాడు. యూసుఫ్‌‌‌‌‌‌‌‌ పఠాన్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ గాడిన పడాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వంక పెట్టడానికి ఏం లేదు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు మహ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ, రషీద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ సత్తాచాటుతున్నారు. పేసర్లలో ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, సందీప్‌‌‌‌‌‌‌‌ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నారు.  అయితే, బాసిల్‌‌‌‌‌‌‌‌ థంపి ఒక్క వికెట్‌‌‌‌‌‌‌‌ కూడా పడగొట్టలేకపోయాడు. మరోవైపు ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లో కూడా ఆరెంజ్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ మరింత మెరుగవ్వాలి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కీలకదశలో క్యాచ్‌‌‌‌‌‌‌‌  వదిలేయడం జట్టు కొంపముంచింది. ఇలాంటి లోపాలను వెంటనే సరిదిద్దుకుంటూనే  సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌  రెండో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌- మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు  అర్హత సాధించే అవకాశముంటుంది.

తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరాలని

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో జట్టు లోగోతో పాటు పేరును మార్చుకున్న ఢిల్లీ అంచనాలకు మించి రాణిస్తోంది. అగ్రశ్రేణి జట్లకు తీసిపోకుండా తొమ్మిది విజయాలు సాధించి సత్తాచాటింది.అయితే కీలక దశలో చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో భారీ తేడాతో ఓడడంతో ఆ జట్టు టాప్‌‌‌‌‌‌‌‌–2లో చోటు దక్కించుకోలేదు. అయినా కూడా టోర్నీ ఆసాంతం జట్టు ఆకట్టుకుంది.  ఈ నేపథ్యంలోనే ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌తో పాటు కెప్టెన్‌‌‌‌‌‌‌‌  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌,  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌పటేల్‌‌‌‌‌‌‌‌ సత్తాచాటుతున్నారు. అయితే ఓపెనర్‌‌‌‌‌‌‌‌  పృథ్వీ షా,  హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ కొలిన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్రామ్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాల్సిన అవసరముంది. ఇక బౌలర్లలో వెటరన్‌‌‌‌‌‌‌‌ ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మ, అమిత్‌‌‌‌‌‌‌‌ మిశ్రా అదరగొడుతున్నారు. వీరికి సహచరుల నుంచి మద్దతు లభించాల్సిన అవసరముంది. టోర్నీ లీడింగ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌ కగిసో రబాడ గాయంతో లీగ్‌‌‌‌‌‌‌‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు 12 ఏళ్ల చరిత్రలో ఢిల్లీ ఎప్పుడు కూడా ఫైనల్లో చోటు దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నెగ్గి తుదిపోరువైపు వడివడిగా అడుగులు వేయాలని భావిస్తోంది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ  చెరోసారి గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

జట్లు (అంచనా)

సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), గప్టిల్‌‌‌‌‌‌‌‌, సాహా, మనీశ్‌‌‌‌‌‌‌‌, యూసుఫ్‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌, నబీ, రషీద్‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌, సందీప్‌‌‌‌‌‌‌‌/థంపి, ఖలీల్‌‌‌‌‌‌‌‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌: శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌) పృథ్వీ, ధవన్‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్రామ్‌‌‌‌‌‌‌‌, రూథర్‌‌‌‌‌‌‌‌ఫర్డ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌, అమిత్‌‌‌‌‌‌‌‌, ఇషాంత్‌‌‌‌‌‌‌‌, కీమో పాల్‌‌‌‌‌‌‌‌, బౌల్ట్‌‌‌‌‌‌‌‌.