ఐపీఎల్కు స్టార్టింగ్ ట్రబుల్! మే 17 నుంచి కొత్త షెడ్యూల్.. విదేశీ ఆటగాళ్ల రాకపై అనుమానాలు

ఐపీఎల్కు స్టార్టింగ్ ట్రబుల్! మే 17 నుంచి కొత్త షెడ్యూల్.. విదేశీ ఆటగాళ్ల రాకపై అనుమానాలు

=ఆపరేషన్ సింధూర్తో స్వదేశాలకు విదేశీ ఆటగాళ్లు
= తిరిగి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్న ప్లేయర్లు
= మే 17 నుంచి తిరిగి ప్రారంభానికి బీసీసీఐ షెడ్యూల్
= ఆరు చోట్ల మ్యాచ్ లకు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
=  వచ్చి ఆడేందుకు ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ కమ్మిన్స్, హెడ్ రెడీ
= మిగతా ఆటగాళ్ల రాకపై అనుమానాలు

హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ లకు స్టార్టింగ్ ట్రబుల్ పట్టుకుంది. పహెల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్తాన్, పీవోకే పరిధిలోని 9 ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఈ క్రమంలో భారత్–పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మ్యాచ్ లు నిరవధికంగా రద్దు చేశారు. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లు వెళ్లిపోయారు.  

ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఐపీఎల్  నిర్వహణకు కేంద్రం అనుమతించింది. దీంతో బీసీసీఐ  మ్యాచ్ లు, వేదికలను రీ షెడ్యూల్ చేసింది. మే 17 నుంచి మ్యాచ్ లు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచల్ లను బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ వేదికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మే 29 క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. 

అయితే, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు వేదికలు ఎక్కడ అనేది ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 10 జట్లలోనూ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు  కమ్మిన్స్ ఉన్నాడు. ఆయనతోపాటు హెడ్ కూడా ఆ దేశానికి చెందిన వాడే. వీళ్లిద్దరూ వచ్చి ఆడేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. మిగతా వారు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. 

ఆయా దేశాలకు క్రికెట్ బోర్డులో చర్చిస్తోంది. మరో వైపు ఐపీఎల్ సీఈవో హేమాంగ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో డైరెక్టుగా మాట్లాడుతున్నారు.  ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెంట్ కంట్రోల్ బోర్డు స్పందించింది. భారత్ వెళ్లడం నిర్ణయం ఆటగాళ్లకే వదిలేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. జూన్ 3న ఐపీఎల్ ముగుస్తుంది.,  జూన్ 11న వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ మొదలవుతుంది. 

ఈ రెండింటికీ మధ్య వారం రోజుల గడువే ఉండటంతో ప్లేయర్లు తిరిగి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారా..? అన్న అనుమానం ఉంది. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్  ప్రస్తుతం ప్లేఆఫ్​ రేసులో ఉన్నాయి. ఈ టీమ్స్ కు సంబంధించిన కీలక ఆటగాళ్లు వచ్చేందుకు వెనుకంజ వేస్తుండటం గమనార్హం. 

రావాల్సింది వీళ్లు..
పంజాబ్ కింగ్స్                 యాన్సెన్, జోష్ ఇంగ్లిష్
ఆర్సీబీ                               హెజిల్ వుడ్, షెపర్డ్, సాల్ట్, బేతెల్
ముంబై ఇండియన్స్       రెకల్టన్, విల్ జాక్స్
గుజరాత్ టైటాన్స్            జాస్ బట్లర్, రూథర్ ఫర్డ్, రాబాడా