IPL 2023: ఐపీఎల్ కొత్త రూల్స్.. టాస్ తర్వాత తుది జట్టు

IPL 2023: ఐపీఎల్ కొత్త రూల్స్.. టాస్ తర్వాత తుది జట్టు

ఐపీఎల్ మజా మొదలయింది. ఐపీఎల్ 2023కి రంగం సర్వం సిద్ధం అయింది. అభిమానులు తమ ఫేవరెట్ జట్టుకు మద్దతునివ్వడం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 15 ఐపీఎల్ సీజన్లు ఒక ఎత్తు.. ఈ  మరో ఎత్తుగా జరుగనుంది. మార్చి 31 నుంచి మొదలుకాబోయే ఈ సరికొత్త సీజన్ కోసం బీసీసీఐ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పోయిన ఏడాది నుంచి ఐపీఎల్ లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో, గుజరాత్ జట్లను కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. పోయిన ఏడాది నుంచే ఐపీఎల్ లో కొన్ని కీలక మార్పులు చేశారు. 

రెండు గ్రూపులుగా విభజించి.. 

పోయిన ఏడాది నుంచి ఐపీఎల్ లో జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గత సంవత్సరం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అన్ని జట్లకు సీడింగ్స్ ఉంటాయి. ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడేలా నిర్ణయించారు. లీగ్ స్టేజ్ లో ఒక జట్టు.. తన గ్రూప్ లో ఉన్న నాలుగు జట్లతో పాటు.. రెండో గ్రూప్ లో ఉన్న సమాన స్థాయిలో ఉన్న వేరొక జట్టుతో రెండేసి మ్యాచులు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండేది. అయితే, ఈసారి ఆ రూల్ ని మార్చింది బీసీసీఐ. 

ఈ సీజన్‌లోనూ 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విడగొట్టింది. కానీ, ఇప్పుడు ఒక గ్రూప్‌లోని జట్టు.. అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే.. గ్రూప్ ‘ఎ’ ఉన్న ముంబయి.. గ్రూప్ ‘బి’ లోని చెన్నై, సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, పంజాబ్‌, గుజరాత్‌ జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత గ్రూప్ ‘ఎ’లోని మిగతా జట్లు.. కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లక్నోతో ముంబయి ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

టాస్ తర్వాత తుది జట్టు..

టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత తుది జట్టును ఎంచుకునే కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో టాస్‌‌‌‌‌‌‌‌కు ముందే ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు క్లాజ్‌‌‌‌‌‌‌‌ 1.2.1 ప్రకారం ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను మార్చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రిఫరీకి సమర్పించే  11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. దీనివల్ల టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను, ఓడితే మరో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే వెసులుబాటు లభించింది. దీనివల్ల బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో గణనీయమైన ప్రభావం కనిపించనుంది. ఈ నయా రూల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు.