IPL 2023: ఐపీఎల్ నయా రూల్స్.. ఇంపాక్ట్ ప్లేయర్ వస్తున్నాడు

IPL 2023: ఐపీఎల్ నయా రూల్స్.. ఇంపాక్ట్ ప్లేయర్ వస్తున్నాడు

టీ20లకు మరింత ఆదరణ పెంచేందుకు బీసీసీఐ కొత్త ప్రయోగం చేయబోతోంది. కొత్తగా ‘ట్యాక్టికల్‌‌‌‌ ప్లేయర్‌‌ సబ్‌‌స్టిట్యూట్‌‌’ రూల్‌‌ను అమల్లోకి తీసుకురానుంది. ఈ కాన్సెప్ట్‌‌ను ‘ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌’గా పేర్కొంది. ఈ రూల్‌‌ వల్ల తుది 11 మందిలో ఒకర్ని రీప్లేస్‌‌ చేసుకునే అవకాశం ఉంటుంది’ అని బోర్డు పేర్కొంది. ఈ రూల్ ఎలా పనిచేస్తుందంటే.. 

ఇంపాక్ట్‌‌, సబ్‌‌స్టిట్యూట్‌‌కు ఇదే పెద్ద తేడా 

ఒకవేళ ఎవరైన బ్యాటర్‌‌ ఔటైతే అతని స్థానంలో ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌గా వచ్చే వ్యక్తి బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ చేయొచ్చు. కానీ 11 మందినే బ్యాటింగ్‌‌కు ఉపయోగించుకోవాలి. ఒకవేళ కొన్ని ఓవర్లు వేసిన బౌలర్‌‌ ప్లేస్‌‌లో వస్తే తన పూర్తి కోటా (4) కంప్లీట్‌‌ చేయొచ్చు. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ కాన్సెప్ట్‌‌ వల్ల టాస్‌‌ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. టీమ్‌‌ టాస్‌‌ ఓడిపోయి సెకండ్‌‌ బౌలింగ్‌‌ చేయాల్సి వస్తే బౌలింగ్‌‌ను బలోపేతం చేసుకోవచ్చు. ఎందుకంటే మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్‌‌ బౌలింగ్‌‌లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే జీవం లేని పిచ్‌‌పై రెండో ఇన్నింగ్స్‌‌లో అదనపు బ్యాటర్‌‌తో బ్యాటింగ్‌‌నూ బలోపేతం చేసుకోవచ్చు. 

మ్యాచ్‌‌లో ఎవరైనా గాయపడినా అతని ప్రభావాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. వర్షం లేదా ఇతర కారణాలతో ఓవర్లను కుదించిన మ్యాచ్​లో స్లైడింగ్‌‌ కటాఫ్‌‌ పాయింట్‌‌తో ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను రంగంలోకి దించొచ్చు. ఉదాహరణకు 17 ఓవర్ల మ్యాచ్‌‌లో ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను 13వ ఓవర్‌‌ ముగిసేలోపు తీసుకోవచ్చు. 11 ఓవర్ల మ్యాచ్‌‌లో 9వ ఓవర్‌‌లోపు రావొచ్చు.10 కంటే తక్కువ ఓవర్ల మ్యాచ్‌‌లో ఇంపాక్ట్​ ప్లేయర్​ రూల్​ అమలు కుదరదు. 20 ఓవర్ల మ్యాచ్‌‌గా మొదలై.. 10 ఓవర్లు కంప్లీట్‌‌ అయిన తర్వాత అనివార్య కారణాలతో ఇన్నింగ్స్‌‌కు అంతరాయం కలిగినా ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను ఇరుజట్లూ ఉపయోగించుకోవచ్చు. ఏదైనా కారణాలతో రెండో ఇన్నింగ్స్‌‌లో ఓవర్లు 10 కంటే తక్కువైనా ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను వాడుకోవచ్చు. 

మూడు లేదా ఐదో ఓవర్లలో ఈ చాన్స్‌‌ను తీసుకోవచ్చు. నార్మల్​గా ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను ఓవర్​ ముగిశాకే తీసుకోవాలి. వికెట్‌‌ పడినప్పుడు, ఫీల్డర్‌‌ గాయపడినప్పుడు మాత్రం ఓవర్​ మధ్యలోనూ తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. గాయపడిన ప్లేయర్​ ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌తో భర్తీ చేసుకోవచ్చు. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌కు అవకాశం ఇచ్చిన ఆటగాడు తిరిగి గ్రౌండ్​లోకి రాకూడదు. బౌలర్‌‌ సస్పెండ్‌‌ అయినా, ఒకే ఓవర్‌‌లో రెండు బీమర్స్‌‌ వేసిన బౌలర్‌‌ ప్లేస్‌‌లోనూ ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ను తీసుకోవచ్చు. కానీ సదరు బౌలర్‌‌ బౌలింగ్‌‌ చేయలేడు.