బౌలింగే బ్రహ్మాస్త్రం!

బౌలింగే బ్రహ్మాస్త్రం!

హైదరాబాద్ నగరం ఫ్రాంఛైజీగా 2013లో దక్కన్ ఛార్జర్స్  స్థానంలో తెరమీదకువచ్చిన సన్‌ రైజర్స్ జట్టు , ఈ ఆరు సీజన్లలో ఒకసారి ఛాం పియన్‌ గా, మరొకసారి రన్నరప్‌ గా చె ప్పుకోదగ్గ స్థా యిలో తమ ప్రస్థా నాన్ని కొనసాగిస్తున్నది. ఇంకో మూడు సార్లు ప్లేఆఫ్స్ వరకూ వెళ్ళగలిగింది. డేవిడ్ వార్నర్ మినహా సూపర్ స్టార్లెవరూ లేకపోయినా కూడా ఈ జట్టు స్థి రమైన ఆటతీరు ప్రదర్శిస్తూ వస్తున్నది. క్రితం ఏడాది వార్నర్ కూడా లేకపోయినప్పటికీ ఫైనల్స్ వరకూ వచ్చింది. ఈసారి బదలాయింపుల్లో శిఖర్ ధవన్‌ ని వదులుకోవాల్సి  వచ్చినా అతని స్థా నంలో ముగ్గు రు మెరికల్లాంటి ఆటగాళ్ళు – విజయ్ శంకర్, షాబాద్ నదీమ్, అభిషేక్ శర్మలను జట్టులో చేర్చు కోగలిగారు. జట్టు అన్ని విధాలా సమతూకంతో ఉంది కా బట్టే ఈ సీజను వేలంలో కూడా ముగ్గురే ముగ్గురిని కొత్తగా చేర్చుకున్నారు.

బలాలు:

బౌలింగ్ బలంతోనే మ్యాచ్‌ లు గెలవడం సాధ్యమవుతుందనడాని కి సన్‌ రైజర్సే నిదర్శనం. చిన్న స్కోరు చేసి కూడా మ్యాచ్ లు గెలవడం వారికే చెల్లిం ది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సి ద్ధా ర్థ్ కౌల్, షాకిబ్, ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన పదునైన బౌలింగే ఈ జట్టు ప్రధాన బలం. జట్టు లో షాకిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు విజయ్ శంకర్,మహమ్మద్ నబీ, దీ పక్ హుడా, యూసుఫ్ పఠాన్ లాంటి మంచి ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లున్నారు. ఈ సీజన్‌ లో వార్నర్, విజయ్ శంకర్ చేరిక వల్ల జట్టు బ్యాటింగ్ కూడా బలపడుతుంది. క్రితం ఏడాది ఆరంజ్ క్యాప్ విజేత కెప్టెన్ విలియమ్సన్ వ్యూహరచనా నైపుణ్యం , కుదురైన బ్యాటింగ్ వారికి మరొక ప్లస్ పాయింట్. విలియమ్సన్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడు కూడా. ఈ మధ్యకాలంలోనే భారత జట్టులో స్థా నం సంపాదించుకున్న విజయ్ శంకర్, ఖలీల్, సి ద్ధా ర్థ్ కౌల్ మరింత ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశముంది.

బలహీనతలు:

వార్నర్, బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో , షాకిబల్ హసన్, స్టా న్‌ లేక్, రషీద్ ఖాన్, నబీ లాంటి విదేశీ ఆటగాళ్ళు సగం టోర్నమెంటుకుమాత్రమే అందుబాటులో ఉండడం ఈ జట్టుకు పెద్ద సమస్య కా వొచ్చు. వారు ని ష్క్రమించాక  జట్టు ద్వితీయార్థం లో బలహీనపడే ప్రమాదముంది. ఇటీవల గాయాల పాలైన వార్నర్, షాకిబ్, విలియమ్సన్‌ ఎంతమేరకు కోలుకున్నరన్నది కూడా చూడాలి. ఓపెనింగ్ జోడీ విషయంలో కూడా సమస్యలున్నాయి. కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాను ఏ స్థా నంలో ఆడించాలన్నది కూడా ఒక తలనొప్పే అవుతుంది.

– సి.వెంకటేష్