IPL 2023: జేబులు ఖాళీ చేసుకుంటూ.. ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు !

IPL 2023: జేబులు ఖాళీ చేసుకుంటూ.. ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు !

ఐపీఎల్ అభిమానులకు రిలయన్స్ జియో భారీ షాక్ ఇచ్చింది. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా 4K క్వాలిటీలో జీయో టీవీ ద్వారా ఫ్రీగా ఐపీఎల్ మ్యాచులు చూడొచ్చని ఆశపడ్డ కస్టమర్లకు నిరాశే మిగిల్చింది. మొదట ఫ్రీ స్ట్రీమింగ్ అని చెప్పి, ఇప్పుడు కొంత డబ్బు చెల్లించాలని తెలిపింది. అయితే, ఆ డబ్బు సబ్ స్క్రిప్షన్ రూపంలో కాకుండా అదనపు డేటాకు చెల్లి్ంచాలని సూచించింది. ఒక పూర్తి ఐపీఎల్ మ్యాచ్ ను 4K క్వాలిటీలో చూడటానికి 25జీబీ, ఫుల్ హెచ్ డీలో చూడటానికి 12 జీబీ, నార్మల్ క్వాలిటీలో చూసేందుకు 2.5జీబీ అవసరం పడుతుందని తెలిపింది. అంటే, మామూలు రీఛార్జ్ ప్లాన్ వాడేవాళ్లు దగ్గరనుంచి క్వాలిటీ వీడియో పేరుతో అదనంగా డబ్బు వసూలు చేస్తుంది. ఈ విషయం తెలిసేసరికి ఐపీఎల్ ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ తిన్నారు. సబ్స్ స్క్రిప్షన్ ఎత్తేసి ఇంటర్నెట్ బ్యాలెన్స్ రూపంలో జీయో తన బిడ్డింగ్ డబ్బును వసూలు చేయనుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

ఐపీఎల్ ప్రసార హక్కును దక్కించుకోవడం కోసం వయోకామ్18 (రిలయన్స్ ఇండస్ట్రీస్) 2.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఐదు సంవత్సరాల జియో తమ స్ట్రీమింగ్ యాప్ లో ఐపీఎల్ మ్యాచులు ప్రసారం చేయొచ్చు. ఈ బిడ్డింగ్ లో డిస్నీప్లస్ హాట్ స్టార్, సోనీల కన్నా జియో ఎక్కువ బిడ్ వేసి ప్రసార హక్కులను దక్కించుకుంది. ఓటీటీ యాప్స్ ద్వారా ప్రతీ ఏటా దాదాపు 550 మిలియన్ మంది ప్రేక్షకులు ఐపీఎల్ ని చూస్తున్నారు