ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, వేలంలో రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చహర్‌కు మరో గాయమైంది. దాంతో, అతను ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కాలు కండరాల్లో చీలిక రావడంతో చహర్ బెంగళూరు ఎన్సీఏలో చేరి కోలుకుంటున్నాడు. దాదాపు నెల రోజులకు పైగా ఎన్సీఏలోనే ఉన్న చహర్‌కు తాజాగా వెన్ను గాయం అయిందని తెలుస్తోంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో, ఈ నెల చివర్లో అయినా చహర్ తమ టీమ్‌తో కలుస్తాడని ఆశించిన చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది.
సుందర్ రెండు మ్యాచ్‌లకు..
గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా చేతివేళ్లకు గాయం అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కనీసం రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడని ఆ టీమ్ హెడ్ కోచ్ టామ్ మూడీ చెప్పాడు.