కొనసాగుతున్న ఐపీఓల సందడి

కొనసాగుతున్న ఐపీఓల సందడి
  •     ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 కొత్త పబ్లిక్ ఇష్యూలు
  •     ముగియనున్న మూడు కంపెనీల ఐపీఓలు
  •     లిస్టింగ్ కానున్న నాలుగు కంపెనీలు

న్యూఢిల్లీ: మార్కెట్‌‌‌‌ పెరుగుతుండడంతో  పెద్ద మొత్తంలో  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. ఈ వారం కూడా ఐదు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను లాంచ్ చేయనున్నాయి.   మొత్తం రూ.1,680.72 కోట్లు సేకరించాలని చూస్తున్నాయి. ఈప్యాక్‌‌‌‌  డ్యూరబుల్స్ ఇంకా తమ ఐపీఓ ప్రైస్ ధరను ప్రకటించలేదు. అందువలన ఈ కంపెనీ సేకరించనున్న ఫండ్స్‌‌‌‌పై క్లారిటీ లేదు. 

ఈ వారం ఐపీఓకి వస్తున్న కంపెనీలు..

1) మెడి అసిస్ట్‌‌‌‌ హెల్త్‌‌‌‌కేర్ సర్వీసెస్‌‌‌‌ 

ఈ కంపెనీ ఐపీఓ  ఈ నెల 15 నుంచి 17 మధ్య ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. షేరు ధర రూ.397 – 418. ఈ హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1,171.6 కోట్లు సేకరించాలని చూస్తోంది. 
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్‌‌‌‌) ద్వారా  2.8 కోట్ల షేర్లను ప్రమోటర్ విక్రమ్‌‌‌‌ జిత్ సింగ్‌‌‌‌ ఛత్వాల్‌‌‌‌, బెసెమర్ హెల్త్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌తో సహా పలువురు షేరు హోల్డర్లు అమ్మనున్నారు. 

2) ఈప్యాక్‌‌‌‌ డ్యూరబుల్స్‌‌‌‌

ఈప్యాక్ ఐపీఓ జనవరి 19 న ఓపెన్ కానుంది. 23 న ముగియనుంది. మరికొన్ని రోజుల్లో షేరు ధరను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. రూమ్‌‌‌‌ ఏసీలను తయారు చేసే ఈ కంపెనీ  రూ. 400 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను ఐపీఓ ద్వారా సేల్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్‌‌‌‌ ద్వారా మరో 1.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌04 కోట్ల షేర్లను అమ్మనుంది. 

3) మ్యాక్స్‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌ 

ఈ  కంపెనీ  స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ (ఎస్‌‌‌‌ఎంఈ) సెగ్మెంట్‌‌‌‌లో ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది.  పర్సనలైజ్డ్ మీడియా అండ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సర్వీస్‌‌‌‌లను అందించే ఈ కంపెనీ ఐపీఓ  జనవరి 15–17 మధ్య ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. షేరు ధర రూ.31–33. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.20.26 కోట్లను సేకరించాలని మ్యాక్స్‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌ చూస్తోంది. ఫ్రెష్‌‌‌‌ షేర్ల ఇష్యూ ద్వారా ఈ ఫండ్స్ సేకరించనుంది. 

4) కోన్స్టెలెక్‌‌‌‌ ఇంజినీర్స్‌‌‌‌

ముంబైకి చెందిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్ కన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ కోన్స్టెలెక్‌‌‌‌  పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.28.70 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద 41 లక్షల షేర్లను అమ్మనుంది. షేరు ధర రూ.66–70. కోన్స్టెలెక్‌‌‌‌ ఇంజినీర్స్ ఐపీఓ ఈ నెల 19 న ఓపెనై 23 న ముగుస్తుంది. 

5) ఎడిక్టివ్‌‌‌‌ లెర్నింగ్ టెక్నాలజీ

ఈ కంపెనీ ఐపీఓ  ఈ నెల 19 న  ఓపెన్ కానుంది. ఒక్కో షేరు రూ.130 – 140 దగ్గర ఐపీఓలో అందుబాటులో ఉంటుంది. బిడ్డింగ్‌‌‌‌కు చివరి తేది జనవరి 23.  ప్రమోటర్లు  రామాంజు ముఖర్జీ,  అభ్యుదయ సునిల్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌  రూ.60.16 కోట్లు సేకరించాలని చూస్తున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూలో 41.37 లక్షల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 1.6 లక్షల షేర్లను అమ్మనున్నారు. 

ఐపీఓ క్లోజింగ్‌‌‌‌..

న్యూ స్వాన్‌‌‌‌ మల్టీటెక్, ఆస్ట్రేలియన్‌‌‌‌ ప్రీమియం సోలార్‌‌‌‌‌‌‌‌ (ఇండియా) ఐపీఓలు  ఈ నెల 15 న ముగియనున్నాయి. శ్రీ మారుతినందన్‌‌‌‌ టూబ్స్‌‌‌‌ ఐపీఓ ఈ నెల 16 వరకు  ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. న్యూ స్వాన్‌‌‌‌ మల్టీటెక్ ఐపీఓ 55.2 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అవ్వగా, ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్‌‌‌‌‌‌‌‌ 64.58 రెట్లు, శ్రీ మారుతినందన్‌‌‌‌ టూబ్స్ ఐపీఓ 4.9 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యాయి. 

లిస్టింగ్‌‌‌‌..

సీఎన్‌‌‌‌సీ మెషిన్స్ తయారు చేసే జ్యోతి సీఎన్‌‌‌‌సీ ఆటోమేషన్ షేర్లు జనవరి 16 న మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కానున్నాయి. ఈ కంపెనీ ఐపీఓ 38.6 రెట్లు సబ్‌‌‌‌స్క్రిప్షన్ సాధించింది. కంపెనీ ఐపీఓ ఈ నెల 9–11 మధ్య ఓపెన్‌‌‌‌లో ఉండగా, రూ.1,000 కోట్లు సేకరించింది. ఒక్కో షేరుని రూ.331 దగ్గర అమ్మింది.  గ్రేమార్కెట్‌‌‌‌లో 15 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు ట్రేడవుతున్నాయి. దీంతో పాటు ఐబీఎల్‌‌‌‌ ఫైనాన్స్ షేర్లు ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఎమెర్జ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో జనవరి 16 న లిస్ట్‌‌‌‌ కానున్నాయి. న్యూ స్వాన్‌‌‌‌ మల్టీటెక్‌‌‌‌ షేర్లు బీఎస్‌‌‌‌ఈ  ఎస్‌‌‌‌ఎంఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో, ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్‌‌‌‌‌‌‌‌ షేర్లు ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఎమెర్జ్‌‌‌‌లో ఈ నెల 18 న లిస్టింగ్ కానున్నాయి.