
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 29.
పోస్టుల సంఖ్య: 348. తెలంగాణ రాష్ట్ర పరిధిలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి: 20 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 09.
లాస్ట్ డేట్: అక్టోబర్ 29.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరూ రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: గ్రాడ్యుయేషన్ స్థాయిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే ఐపీపీబీ ఆన్లైన్ టెస్టు నిర్వహించవచ్చు.
పూర్తి వివరాలకు ippbonline.com వెబ్సైట్లో సంప్రదించగలరు.