తెలుగు రాష్ట్రాల్లో ఐకూ జెడ్​9ఎక్స్​

తెలుగు రాష్ట్రాల్లో ఐకూ జెడ్​9ఎక్స్​

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో తన వృద్ధిని పటిష్టం చేసే లక్ష్యంతో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్ ఐకూ,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గురువారం తన తాజా స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ – జెడ్​9ఎక్స్​ను లాంచ్ ​చేసింది. తమ అమ్మకాల్లో తెలంగాణ నుంచి భారీ వాటా ఉందని తెలిపింది. సంవత్సరానికి 35శాతం వాల్యూమ్ వృద్ధిని సాధించింది.  అంతేగాక   అమ్మకాలలో భారతదేశంలో ఐకూకు హైదరాబాద్​ నంబర్ వన్ నగరం అని,  అమ్మకాలు  వార్షికంగా 28శాతం పెరిగాయని ప్రకటించింది. 

ఈ ఫోన్లో 6,000 ఏంఏహెచ్ ​బ్యాటరీ,   44 వాట్ల ఫ్లాష్ చార్జ్‌‌‌‌‌‌‌‌, క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​1 ప్రాసెసర్, 6.72 ఇంచుల స్క్రీన్​ ఉంటాయి. ఫోన్​ అండ్రాయిడ్​14 ఆధారిత ఫన్​టచ్​14 ఓఎస్​తో నడుస్తుంది. 4జీబీ+128జీబీ ధర రూ. 11,999 కాగా, 6జీబీ+128జీబీకి   రూ. 12,999. అయితే  8జీబీ+128జీబీకి  రూ. 15,999 అవుతుంది. ఐకూ జెడ్​9ఎక్స్​ ఐకూ ఈ–-స్టోర్​తోపాటు అమెజాన్​లో అందుబాటులో ఉంటుంది.