యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతుంటే.. అది ప్రారంభించిన అమెరికా-ఇరాన్ దేశాలు మాత్రం ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాయి. యుద్ధం బూచిగా చూపించి గల్ఫ్ దేశాలకు రక్షణ సామాగ్రిని అమ్ముకుంటూ అమెరికా లాభపడుతుంటే.. హార్మూజ్ జలసంధితో ఇరాన్ క్యాష్ చేసుకుంటోంది. లేటెస్టుగా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నుంచి టోల్ వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది.
హార్మూజ్ జలసంధి గుండా ప్రవహించే నౌకల నుంచి రెండు మిలియన్ డాలర్లు అంటే సుమారు 18.8 కోట్ల రూపాయల టోల్ చార్జీలను వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. టోల్ చెల్లించే నౌకలనే జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పేర్కొంది. ఇది ఇప్పటికే అమలులోకి తెచ్చినట్లు ఇరాన్ ఎంపీ అలాయిద్దిన్ బొరౌజెర్దీ ఇరాన్ అధికారిక మీడియా IRIB తో పేర్కొన్నారు.
దశాబ్దాలుగా జలసంధి తమ ఆధీనంలో ఉందని.. ఒక సార్వభౌమ దేశంగా టోల్ వసూల్ చేసే హక్తు తమకుందని బొరౌజెర్దీ చెప్పారు. దీంతో ఇరాన్ ఆర్థికంగా మరింత బలపడుతుందన్నారు. యుద్ధ కారణంగా మేము చార్జీలను వసూళ్లు చేయక తప్పడం లేదని అన్నారు.
ట్రంప్ హెచ్చరికలు:
అంతకు ముందు హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో విడిచిపెట్టకుంటే తీవ్ర పరిణామాలుంటాయని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పవర్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ మరింత ముందుకొచ్చి.. టోల్ వసూల్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
