అమెరికా, ఇరాన్ మీమ్స్ వార్‌లోకి టాలీవుడ్సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ‘భగవంత్ కేసరి’ సినిమా డైలాగ్‌తో ఇరాన్.. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ట్రంప్ ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తానని అంటాడు.. కానీ ఇరాన్ బలహీనమైందికాదని అతడికి తెలుసు.. ఎందుకంటే, హాలీవుడ్‌కు బదులుగా వారు ఇటీవలే బాలీవుడ్ చూస్తున్నారని మాకు తెలిసింది’ అంటూ జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం భగవంత్ కేసరి యాక్షన్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇరాన్ ఎంబసీ పేర్కొన్నట్టు ఇది బాలీవుడ్ సినిమా కాదని, తెలుగు చిత్రమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘భారతీయ సోదరుల నుంచి సమాచారం తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పరిస్థితులు ఎలా మారుతాయో చూసి ఆస్వాదించండి’ అంటూ ఇరాన్ ఎంబసీ సైతం సరదాగా రిప్లై ఇచ్చింది. - టెహ్రాన్
