ఇరాన్ లో వెల్లువెత్తుతున్న మహిళల ఆందోళనలు

ఇరాన్ లో వెల్లువెత్తుతున్న మహిళల ఆందోళనలు

ఇరాన్ లో మహిళల ఆందోళనలు ఆకాశన్నంటుతున్నాయి. ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హిజాబ్ ధరించలేదని మహ్స అమినీ అనే 22 ఏళ్ల అమ్మాయిని మోరారిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ ఘటనపై దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. పోలీసులు ఆమె తీవ్రంగా కొట్టడం వల్లే మహ్సా అమినీ చనిపోయిందని మహిళలు ఆరోపిస్తు్న్నాయి. ఇరాన్ లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే చట్టం ఉంది. అయితే తాజాగా మహ్సా అమిని మరణం తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడి మహిళలు బయటికొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

ఇరాన్ మహిళలు ఇప్పటికే నిరసనల్లో పాల్గొంటుండగా తాజాగా కొందరు మహిళలు మహ్సా అమిని మృతికి నిరసనగా తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. హిజాబ్ లను తగలబెడుతున్నారు. తమ పట్ల కఠినంగా అమలుపరుస్తున్న చట్టాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జుట్టును కట్ చేసుకుంటున్న ఓ వీడియోను తాజాగా ఇరాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు. తనతో పాటు మరికొందరు టెహ్రాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. తాను 7ఏళ్ల నుంచే హిజాబ్ ధరించకుండా బయటికి వెళ్లనిచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రోజురోజుకు మిన్నంటుతున్న ఆందోళనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలనుపయోగించి ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.