ఇరాన్ నెంబర్ 2 లారిజానీని చంపేశామన్న ఇజ్రాయెల్ : లేదు లేదు ఆయన బతికే ఉన్నాడన్న ఇరాన్

ఇరాన్ నెంబర్ 2 లారిజానీని చంపేశామన్న ఇజ్రాయెల్ : లేదు లేదు ఆయన బతికే ఉన్నాడన్న ఇరాన్

యుద్ధంలో బిగ్ బ్రేకింగ్.. ఇరాన్ నెంబర్ 2.. ఇరాన్ యుద్ధాన్ని నడిపిస్తున్న లారిజానీని చంపేశామంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. మా దాడుల్లో ఆయన చనిపోయాడు.. ఇరాన్ దేశానికి బిగ్ షాక్ అని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనిపై ఇరాన్ దేశం స్పందించింది. లారిజాని క్షేమంగా ఉన్నారని.. ఆయన బతికే ఉన్నాడని.. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొన్నామని టెహ్రాన్ నుంచి ప్రకటన విడుదల అయ్యింది. ఇంతకీ ఆయన బతికే ఉన్నాడా.. చనిపోయాడా.. ఎవరు చెబుతున్నది నిజం అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇరాన్​లో అలీ ఖమేనీ తర్వాత నెంబర్​ 2 గా ఉన్న ఇరాన్ భద్రతా అదికారి అలీ  లారిజాని మరణంపై సందిగ్దం నెలకొంది. ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే, టెహ్రాన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 

►ALSO READ | చైనాలో రోబోను అరెస్ట్ చేసిన పోలీసులు : 70 ఏళ్ల మహిళ భయపడిన కేసులో..

లారిజానీ హతమయ్యాడు.. ఖమేనీతోపాటు హతమైన దుష్టశక్తుల కూటమి సభ్యులతో కలిసి నరకపు అగాధంలోకి వెళ్లిపోయారంటూ  కాట్జ్​ కార్యాలయం Xలో రాశారు. మంగళవారం ఉదయం  లారిజాని మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా నుండి వార్తలు వెలువడ్డాయి. అయితే లారి జాని బతికే ఉన్నాడని ఇరాన్​ చెబుతున్నప్పటికీ ఆయన మరణంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యక్ష ప్రకటన విడుదల చేయలేదు.

అయితే ఇస్లామిక్ రిపబ్లిక్  అమరవీరులకు నివాళులర్పిస్తూ లారిజాని సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నావికాదళానికి చెందిన అమరవీరుల అంత్యక్రియల సందర్బంగా ఈ పోస్ట్ చేశారు. వారి జ్ణాపకాలు ఇరాన్​ జాతి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.. వారి అమరత్వం రాబోయే రోజుల్లో ఇస్లామిక్​ సైన్యం పునాదిని బలోపేతం చేస్తాయి.వారికి స్వర్గం ప్రాప్తించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఆ పోస్టు లో రాశారు. అయినప్పటికీ లారిజాని బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే ఇటీవల  లారిజాని అమెరికా అద్యక్షుడు ట్రంప్​ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సరిగా 47 ఏడేళ్ల క్రితం ఇరాన్ ఇస్లామిక్​ విప్లవంతో ప్రజల విజయం సాధించడానికి ముందురోజు పహ్లావి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నినాదాలు చేస్తున్న భారీ జనసమూహాల శబ్దం నిజమైనది కాదని అది టేప్​ రికార్డింగ్​ శబ్దమని ట్రంప్​ అన్నారు.. ఇప్పుడు ఇరాన్​ నగరాల్లో లక్షలాది మంది అమెరిక వ్యతిరేక, ఇజ్రాయెల్​ వ్యతిరేక సమావేశాలు, నినాదాలపై ట్రంప్​ మాట్లాడుతూ అవి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ అని అంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్​ తో ఘర్షణల్లో ఇరాన్​ ధృఢంగా ఉందని లారిజాని ప్రకటించారు. అయితే లారిజానీ ఆ ప్రకటన చేసిన కొన్నగంటల్లో ఆయన తాము జరిపిన దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్​ప్రకటించింది.