మేం యుద్ధానికి దిగం.. క్రిమినల్స్ ను వదిలిపెట్టం..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన

మేం యుద్ధానికి దిగం.. క్రిమినల్స్ ను వదిలిపెట్టం..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన

టెహ్రాన్: ఇరాన్​లో అల్లర్లకు పాల్పడుతున్న జాతీయ, అంతర్జాతీయ క్రిమినల్స్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. 

తాము యుద్ధానికి దిగబోమని,  అదేటైంలో క్రిమినల్స్​ను శిక్షించకుండా వదలబోమని ప్రకటించారు. తమ దేశంలో నిరసనకారులను రెచ్చగొట్టి, అల్లర్లు జరిగేలా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఫైర్ అయ్యారు. 

అమెరికా మిలటరీ బేస్​లపై తాము దాడులకు సిద్ధమవుతున్నామన్న వార్తలను ఆయన ఖండించారు. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. 

కాగా, ఇరాన్​లో గత నెల 28 నుంచి జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 500 మంది పోలీసులు సహా 5 వేల మంది చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి అష్ఘర్ జహంగీర్ వెల్లడించారు.