IRCTC Jobs: ఇంట్లో కూర్చుని నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు

IRCTC Jobs: ఇంట్లో కూర్చుని నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు

న్యూఢిల్లీ: ఇంటి దగ్గరే ఉండి ఎక్కువ డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారా? ఇలాంటి వారికి గుడ్ న్యూస్. IRCTC మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. ఇంటి పట్టునే ఉండి నెలకు రూ.80 వేలు సంపాదించే ఛాన్స్ కల్పిస్తోంది. అదెలాగో అంటారా? వివరాలు.. IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)లో బుకింగ్ ఏజెంట్ గా చేరితే చాలు. ఈ సంస్థ రైల్వే ప్రయాణికులకు ఆన్లైన్ బుకింగ్ టిక్కెట్లు, క్యాటరింగ్ సర్వీసులను అందిస్తుంది. డేటా ప్రకారం.. భారత రైల్వే టికెట్లలో 55 శాతం టిక్కెట్లు ఈ సంస్థ ద్వారానే బుక్ అవుతాయి.

ఎంత సంపాదించొచ్చు?
IRCTCలో ఆతరైస్డ్ బుకింగ్ ఏజెంట్ గా చేరితే మంచి ఆదాయం వస్తుంది. నాన్ ఏసీ క్లాసులో PNR టికెట్ బుక్ చేస్తే రూ.20, అదే ఏసీ క్లాసులో PNRకు రూ.40 సంపాదించవచ్చు. ఇవిగాక, రూ.2 వేలకు పైగా ట్రాన్స్ జాక్షన్ కు 1 శాతం అమౌంట్ మన అకౌంట్ లో పడుతుంది. IRCTC ఏజెంట్ గా ఒక నెలలో ఎన్ని టికెట్లనైనా బుక్ చేయొచ్చు. ప్రతి బుకింగ్, ట్రాన్స్ జాక్షన్ పైనా ఏజెంట్ కు కమీషన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా నెల మొత్తం కష్టపడితే సుమారు రూ.40 నుంచి రూ.50 వేల ఆదాయం ఎటూ పోదు. ఇంకా బాగా శ్రమిస్తే రూ.80. వేల వరకు సంపాదించుకోవచ్చు.

ఏజెంట్ అవ్వడం ఎలా?
IRCTC ఏజెంట్ అవ్వడం సులువైన ప్రక్రియే. 
* IRCTC వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఏజెంట్ కు సంబంధించిన ఫామ్ నింపాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లతోపాటు డిక్లరేషన్ ఫామ్ ను సైన్ చేసి స్కాన్ చేయాలి.
* వెరిఫికేషన్ అనంతరం నిర్ణీత డిపాజిట్ రుసుము చెల్లిస్తే IRCTC ఐడీ క్రియేట్ అవుతుంది. డిజిటల్ సర్టిఫికేట్ క్రియేట్ అయ్యాక ఓటీపీ, వీడియో వెరిఫికేషన్ జరుగుతుంది. 
* వీడియో వెరిఫికేషన్ తర్వాత నిర్ణీత IRCTC ఫీజును కట్టాలి. ఈ ప్రక్రియ పూర్తయితే ఏజెంట్ వివరాలు మెయిల్ ఐడీకి పంపబడతాయి. 

బుకింగ్ ఏజెంట్ ప్లాన్లు

* ఒక సంవత్సరం బుకింగ్ ఏజెంట్ గా పని చేయడానికి రూ.3,999 చెల్లించాలి. 
* రెండేళ్లు ఏజెన్సీ హక్కులకు రూ.6,999 కట్టాలి.
* ఒక నెలలో ఏజెంట్ వందలోపు టికెట్లు చేస్తే ప్రతి టికెట్టు మీద IRCTCకి రూ.10 చెల్లించాలి. అదే 101 నుంచి 300 లోపు టికెట్లకు ప్రతి టికెట్ పైన రూ.8 కట్టాలి. అదే 300 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ చేస్తే టికెట్ పై రూ.5 సంస్థకు చెల్లించాలి. 

IRCTC ఏజెంటుకు దక్కే ప్రయోజనాలు
* అన్ లిమిటెడ్ టికెట్ బుకింగ్
* అన్ని రకాల టికెట్లను పెద్ద సంఖ్యలో (బల్క్) ఎన్నయినా బుక్ చేయొచ్చు. 
* జనరల్ పబ్లిక్ బుకింగ్ ఓపెన్ అయిన 15 నిమిషాల తర్వాత తత్కాల్ లో బుక్ చేసుకోవచ్చు. 
* రైలు, బస్సు, విమానాలు, హోటల్స్, హాలీడేస్, పెయిడ్ చార్జెస్ ఇలా అన్ని రకాల బుకింగ్స్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.

దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు
* ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఫొటో, ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్, డిక్లరేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్.