సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోగా ఇరెడా ఐపీఓ 

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోగా ఇరెడా ఐపీఓ 

న్యూఢిల్లీ:  ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఇరెడా) ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను సెప్టెంబర్ నాటికి దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ పబ్లిక్​ ఆఫర్​ కోసం  మర్చంట్ బ్యాంకర్లను నియమించామని అన్నారు. రాబోయే 3–-4 నెలల్లో డీఆర్​హెచ్​పీని దాఖలు చేస్తామని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్  పబ్లిక్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (దీపమ్​) కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు.

మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ  పరిధిలోని ఇరెడా రెన్యువబుల్​ ఎనర్జీ ప్రాజెక్టులకు లోన్లు  ఇస్తుంది.   ఎకనామిక్ అఫైర్స్​పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ ఇందులో ప్రభుత్వ వాటాను కొంతవరకు అమ్మడానికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లాలన్న ప్రపోజల్​ను ఆమోదించింది.  ప్రభుత్వం నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఇరెడాకు కేంద్రం 2022 మార్చి లో  రూ. 1,500 కోట్ల మూలధనాన్ని ఇచ్చింది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఇరెడా రూ.865 కోట్ల ఆల్ టైమ్ హై నికర లాభాన్ని నమోదు చేసింది.