ఐరన్ కోసం నేరేడు

ఐరన్ కోసం నేరేడు
  • ఈ సీజన్​లో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి. నల్లని రంగులో వగరుగా, తియ్యగా ఉండే వీటిలో పోషకాలు బోలెడు. ఈ పండులో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు కూడా ఎక్కువే అంటోంది ఫుడ్ థెరపిస్ట్ రియా బెనర్జీ. 
  • నేరేడులో శరీరానికి అవసరమైన కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. ఈ పండు తింటే ఐరన్​ అందుతుంది. 
  • క్యాలరీలు తక్కువ ఉండే ఈ పండుని డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. ఇందులోని పాలీఫినాల్స్​ డయాబెటిస్​ని తగ్గించడంలో సాయపడతాయి కూడా. నేరేడు పండులోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం గుండె సంబంధిత సమస్యల్ని రానీయవు.
  • ఈ పండు అజీర్తి, కడుపుఉబ్బరం లాంటివి తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు శరీరం నీరు పట్టకుండా చూస్తుంది.
  • నేరేడు పండు తింటే ముఖం మీద వచ్చే మొటిమలు, మడతలు, నల్లమచ్చలు పోతాయి. ఇందులోని విటమిన్​–సి రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.