సైనికుల కోసం ‘ఐరన్ మ్యాన్’ సూట్

సైనికుల కోసం ‘ఐరన్ మ్యాన్’ సూట్

డెవలప్ చేసిన వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా

శ్యామ్ చౌరాసియా.. వారణాసిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంప్లాయి. ఐరన్ మ్యాన్ సినిమాలు చూసి బాగా ఇన్ స్పైర్ అయ్యారు. ఐరన్ మ్యాన్ సూట్ తరహాలో మన సైనికుల కోసం ఒక సూపర్ స్ట్రాంగ్ సూట్ ను తయారు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ప్రొటోటైప్ సూట్ ను రెడీ చేశారు. మన సైనికులు ఈ సూట్ ధరిస్తే.. ఎదురుగా శత్రువులు బులెట్ల వర్షం కురిపిస్తున్నా  ధైర్యంగా ముందుకెళ్లొచ్చని శ్యామ్ చెబుతున్నారు. టెర్రరిస్టులు వెనక నుంచి దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించినా, ఈ సూట్ సెన్సర్లతో పసిగడుతుందని అంటున్నారు. ఈ సూట్ వేసుకుంటే మన సైనికులు శత్రువులతో యుద్ధం చేయాల్సి వచ్చినా, టెర్రరిస్టులతో ఎన్ కౌంటర్లు చేయాల్సి వచ్చినా ప్రాణభయం లేకుండా ధైర్యంగా పోరాడవచ్చని శ్యామ్ పేర్కొంటున్నారు. టిన్ లోహంతో తయారు చేస్తున్న ఈ సూట్ ను రిమోట్ తో కూడా ఆపరేట్ చేయొచ్చని, దీనిలో గేర్లు, మోటార్లు కూడా ఉంటాయని  అంటున్నారు. ‘‘పూర్తిస్థాయి సూట్ ను తయారు చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉంది. ఇలాంటి సూట్ల తయారీ కోసం పాకిస్థాన్ లాంటి పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మనం కూడా ఇలాంటి సూట్లను రెడీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనిపై డీఆర్డీఓ వంటి సంస్థలు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా” అని శ్యామ్ విజ్ఞప్తి చేస్తున్నారు.