మా పార్టీకి ఆయన సేవలు అక్కర్లే!

మా పార్టీకి ఆయన సేవలు అక్కర్లే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినాయత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, గ్రూప్ ఆఫ్ 23లో ఒకరైన కపిల్ సిబల్ మరోమారు విమర్శలకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై సిబల్ స్పందిస్తూ.. ప్రజలకు ఆజాద్ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు. ఆజాద్ ఈ దేశానికి అవసరమని.. కానీ తమ పార్టీకి మాత్రం ఆయన సేవలు అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పై వ్యంగ్య బాణాలు విసిరారు. 

గులాం నబీ ఆజాద్ కు పద్మ అవార్డు ఇవ్వడంపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర కామెంట్ చేశారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య గురించి జైరాం రమేశ్ ప్రస్తావిస్తూ.. ఆయన సరైన పని చేశారన్నారు. బుద్ధదేవ్ ఆజాజ్ (స్వేచ్ఛ) కావాలని అనుకున్నారని.. గులాంలా మారాలనుకోలేదని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాల్నా?

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

గుడ్‎న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్