గుడ్‎న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్

V6 Velugu Posted on Jan 26, 2022

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దంపతులు శుభవార్త చెప్పారు. యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ మంగళవారం పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

‘దేవుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడని మా అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమయంలో మా గోప్యతను మీరు గౌరవించాలని కోరుకుంటున్నాం’ అని వారిద్దరూ ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ లకు 2011 సంవత్సరంలో ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం పెరిగి.. 2016లో పెళ్లి చేసుకున్నారు. హాజెల్ బాలీవుడ్ చిత్రపరిశ్రమకు సుపరిచితురాలు. ఆమె సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ చిత్రంలో కరీనా కపూర్ బెస్ట్ ఫ్రెండ్‎గా నటించింది. అంతేకాకుండా బిగ్ బాస్ 7లో కూడా పాల్గొంది. 

యువరాజ్ సింగ్ అక్టోబర్ 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. యువరాజ్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారతదేశం తరపున 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. భారత క్రికెట్‌కు 19 సంవత్సరాల పాటు సేవలందించిన యువీ.. జూన్ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

For More News..

భారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

Tagged Cricket, Bollywood, Yuvraj Singh, Bodyguard, Hazel keech

Latest Videos

Subscribe Now

More News